ఈ పుట ఆమోదించబడ్డది

రాణీ సంయుక్త


బలె భయంకర ధ్వానంబులు మిన్నుముట్టలేచి గోడల రాళ్లు కొన్ని గూలెనేకాని పూర్తిగఁ బడవయ్యె. అంత మరల గాతములదీసి మందుగూర నారంభించిరి. కోటగోడ లీరెండవ పర్యాయము కూలునను భయంబున లోపలివారెల్లరు నీవైపునకేచేరి శత్రువుల దగ్గరరాకుండ జేయుచుండిరి. వేలకొలది గూలు చున్నను వీడక కోటను నాశనము చేయవలయునని పట్టుఁబట్టి చక్రవర్తిసైనికులు గుండ్లలకు వెఱవక బందూకుల దెబ్బలఁ దప్పించుకొనుచు సురంగములద్రవ్వి మరల మందుగూర సాగిరి. ద్వారమును భేదింప నున్న వారు తమకించుక పైదాటి తగ్గినందున బూర్వముకన్న నెక్కువగఁ బనిచేయుచుండిరి. ఎడతెరిపి లేకుండఁ బ్రయోగింపసాగిన ఫిరంగిదెబ్బలచే నారెండవ ద్వారపు దలుపులును వకావకలయ్యెను. అనంతరము మూడవకవాటము నాశనమొనరింపఁ గడగిరి. పశ్చిమ దిశయందలి వారతిప్రయత్నముమీద గాతముల మందుతోనింపి మరల నగ్నినిడ బ్రధమమున వలెనే భీకరధ్వనులుప్పతిలి నేలయంతయు గదలి గోడల కతికిన రాళ్లన్నియు నెక్కడవక్కడ జారిగోడలు శిథిలము లయ్యెను. వెంటనే నాప్రక్క. నున్న వారెల్లరు చొరవఁ జేసుకొని లోపల బ్రవేశింపసాగిరి. ఈ తరుణమందే తూర్పు దిశయం దొక్క పర్యాయముగ దాకిన నిరువది ఫిరంగుల దాకున దలుపులు భిన్నంబులయ్యె. ఈ ప్రక్కనుండియు జక్రవర్తిసేన లోపల బ్రవేశింపసాగెను. అంత నాతతాయి దక్షిణోత్తరముల వారికూడ లోపలఁ బ్రవేశబెట్టెను. చక్రవర్తి సైన్యమంతయు లోపలజేరి

154