ఈ పుట ఆమోదించబడ్డది

ఇరువది రెండవ ప్రకరణము


వీడక గోడల కెగబ్రాకుచుండిరి. వీరలిక్కడ నిట్లుపోరాడుచుండ మిహిరుఁడు తనవారిచే నుత్తరపుగవను నాశనము జేయించు చుండెను. ఫిరంగులగోడల చివరలకు గురిపెట్టించి కొట్టించు చుండెను. అందువలన నాభాగమంతయు ధ్వంసము కాఁజొచ్చెను. వందలకొలది ప్రాణము లొక్క నిముసమునఁ బోవుచున్నను వెనుదీయక చక్రవర్తి సేన నాలుగువారముల పర్యంతము హోరాహోరీగ బోరాడుచుండెను. అప్పటికిని గోట స్వాధీనము కాకుండెను. అంత చక్రవర్తి దుర్గమును గైకొని కాని యావల నడుగిడనని శపధము వట్టి ఢిల్లీనుండి మఱికొంత సేనను గొనిరమ్మని వేగులవారి నంపెను. ప్రాగ్దక్షిణోత్తర పార్శ్వములే శాత్రవులు ముట్టడించి యున్నందున లోపలివారలు పడమటిదిక్కున నించుక నజాగ్రత్తతో నుండిరి. చక్రవర్తి యాసంగతి నెఱిఁగి పడమటిభాగమున రెండు ఫర్లాంగుల దూరమునుండి కందకము మట్టమున కేటవాలుగ నుండునట్లు గోతినిద్రవ్వి కోటగోడల యడుగున సొరంగములుదీసి మందుగూరి కాల్చ నాజ్ఞాపించెను. గాతములుదీసి మందుగూరు సమయమున నీసంగతి లోపలివారలు కనుఁగొని యాప్రక్క కేగి శత్రువులపై నిప్పుల గురిపింప మొదలిడిరి. ఆ తరుణమునఁ దూర్పు దిశయందలి సార్వభౌమసేన విజృంభించి మొదటి ద్వారపుదలుపులను శకలములు కావించెను. వెంటనే రెండవదాని భేదింప గడగిరి. పడమటి దిశ యందలి వారలెట్లో తమాపని బూర్తిజేసుకొని మందునకు నిప్పంటించగా సంవర్తకాలమందలి పిడుగులం

153