ఈ పుట ఆమోదించబడ్డది

రాణీ సంయుక్త


భేదింప నంపెను. కుంభీలకు నాయకత్వమున మఱియొక భాగము నుత్తరము ముట్టడింప బంపెను. తక్కిన భాగమును మిహిరుడను వాని యాధిపత్యమున దక్షిణముదాక నంపి వీరందఱకుఁ దోడు పడ నాతతాయిం బనిచెను. చక్రవర్తి యాజ్ఞానుసారము సైనికి లెల్లఱు బందూకులు గాల్చుచు వెడలి కోటను ముట్టడివేసిరి. లోపలనున్న జయచంద్రు సైనికులు చెలరేగి యెడతెరిపి లేకుండ ఫిరంగులను, బాణములను శత్రువులపై బ్రయోగింపసాగిరి. బహిర్ద్వారంబు భేదింప వెడలిన కంకటుఁ డత్యుత్సాహమున దనసేనను ముందుకు నడిపించుచుండెను.

విధి విరామము లేకుండ వచ్చుచున్న బందూకుల గుండ్లవలనఁ బెక్కుమంది చచ్చు టవలోకించి కంకటుఁడు సందులేకుండ దనసేన కడ్డముగ కుంజరయూధముల నిలువం బెట్టించి వాహిని నత్యంత పరాక్రమమున ముందుకు నడిపించి ఫిరంగులబెట్టించి ద్వారములఁ బగులగొట్టించు చుండెను. ఒక్కొక్క ఫిరంగీతాకుడునకు పిడుగువడినభంగి గొంత తడపు వరకును హోరుమను మ్రోత మోగుచుండెగాని తలుపులు మాత్రము స్వాధీనము కాకుండెను. దక్షిణాశయందున్న సేన గోడలపైకెక్క సాహసముసేసి యగాధముగనున్న కందకమును మనుజాశ్వకుంజర కళేబరవారంబులఁ బూడ్చి కోటగోడల కెగబ్రాకసాగెను. లోపలిపొరలు శత్రువులు దరికిరాకుండ నిప్పుల వర్షము గురిపింపఁ జొచ్చిరి. ప్రాణముల కాశింపక సార్వభౌమ నైనికులు తమవారలు కుప్పలుగ గూలుచున్నను ధైర్యము

152