ఈ పుట ఆమోదించబడ్డది

రాణీ సంయుక్త


జంప నేడ్చు పితరుల యొక్కయు, బితరులఁజంప నేడ్చు బిడ్డల యొక్కయు, మగలఁ బరాభవింప మూర్చిల్లు కులాంగనల యొక్కయు, హాహాకారంబులును, రోదనంబులును గలసి భూన భోంతరములు నిండ దేశమంతయు నల్లకల్లోలము గావింపఁ జొచ్చిరి. ఈ దుష్టాత్ముల ధాటికి వెఱచి కొంపల విడనాడి యడవులకుఁ బరువెత్తువారును, మానము గోపాడుకొనఁ బ్రాణహత్య గావించుకొనువారును, తమ భార్యల బెట్టుగాముల దిలకింపనోడి ముందు వారిఁజంపి పిదప దమజీవంబులఁ గోల్పోవు మానధనులునునై మనుష్యులు భీభత్సమగుచుండిరి. చదువరులారా! మనదేశంబున శిశుహత్యలు, బాల్యవివాహములు, సహగమనములు మొదలగు దురాచారములు ప్రబలుట కివియే కారణములు, కట్టా ! ఇన్ని యాక్రందనములతోఁ గూడిన యార్యావర్తపు నిప్పటి యవస్థఁ జూచినను, విన్నను నెట్టివారికైన మనస్సు కలుక్కుమనక మానదుకదా ! అట్లు మ్లేచ్చులు విసుగుజనించునంతదాక దేశమునంతయు ధ్వంసము చేసిపోయి తమ జయమును కుతుబుద్దీను కెఱుకపఱుప సంతోష భరితుఁడై యతడు వారలకనేక బహుమతులొసగి మన్నించెను. ఆ సమయమున మఱికొందఱు చారులరుదెంచి ప్రచండునకుఁ జక్రవర్తికి జరిగిన సంగరమును గూర్చియుఁ గొన్ని నూత్న విషయములఁ గూర్చియుఁ దెలిపిరి. అందుపై గొంతసేన నంపవలసినదిగ సుల్తానుగారికిఁ దెలిపి దానికొఱకుఁ గుతు బుద్దీన్ నిరీక్షించుచుండెను.

150