ఈ పుట ఆమోదించబడ్డది

ఇరువదియొకటన ప్రకరణము


గారము దినముల కొలది దగుల బడుచుండెను. సత్యములగు నార్యుల శాస్త్ర సమూహంబులన్నియు నాశనమై పోయెను. శిల్పశాస్త్రములన్నియు నడవిపాలయ్యెను. ప్రకృతి శాస్త్రంబులు మన్ను గలిసె. వైద్య శాస్త్రంబులు రూపుమాసె, భూగోళ ఖగోళ శాస్త్రంబు లేటగలిసిపోయెను. సత్యశాస్త్రములన్నియు నట్లు వినాశములై పోవుటవలననే యిప్పుడు ప్రబలియున్న అసత్య శాస్త్రములు మనకు గతియైనవి. మఱి కొందరు కఠినాత్ములు పసిబిడ్డల గొంతులఁ బిసికి చంపగడఁగిరి. తల్లుల హస్త తలంబులం బరుండి పాలుద్రావు పసికూనల బలవంతముగ లాగుకొని "తండ్రులారా! మాకన్న బిడ్డల రక్షించి మమ్ముజంపు" డని శిరంబు లందించుచున్నను వినక మాతలఁబడదన్ని వారి కన్నుల ముందు నాశిశువుల లేతకంఠముల నరటితూండ్లవలె ద్రుంచి మొగమున విసరిపారవైచిపోవ దల్లులు “హా" యని గుండెలు పగిలి చచ్చుచుండిరి. మఱికొందఱు క్రూరులు కొంచెము మాటలాడనేర్చిన బిడ్డ లమ్మాయవి వెనుదగిలి వచ్చుచుండ వారి తల్లులనఱకి పారవైచుచుండిరి. కొందరు రాక్షసులు చక్కగఁ బండి కోతకు సిద్ధమగుచున్న నిండుపైరుల నెక్కడివక్కడ నాశనము సేయ జొచ్చిరి. గ్రామములందలి ధాన్యపుకొట్లకు నాముదము వోసి నిప్పంటింప గడగిరి. మఱికొందఱు దయాశూన్యులు గృహోపయోగములగు బశువుల ఖండించి వాటి మాంసము యజమానుల యెదుటనే పక్వముచేసుకొని భుజింపసాగిరి. ఆకృత్యములకు రోతపడువారి గ్రిందఁబడదన్ని వారి నోళ్ళ యందు బచ్చిమాంసపు ముద్దలఁదెచ్చి క్రుక్కుచుండిరి. బిడ్డలఁ

149