ఈ పుట ఆమోదించబడ్డది

రాణి సంయుక్త


నని పల్కెను. అప్పుడింకొకఁడు ముందరికివచ్చి తక్కినవారితో " అరే! వీఁడు గొఱ్ఱెల కాపరికదా ! వీని నెటులైన లోఁబఱచుకొని యుంచుకొంటిమా మాంసము దొఱకక చచ్చిపోవుచున్న మనకీ దేశమునఁ గావలసినంత పలలము పుష్కలముగ లభింప గలదు." అన నందఱు నియ్యకొని గొఱ్ఱెలకాపరితో నిట్లు మాటలాడసాగిరి.

సిపా : అరే నీవు మా వద్దనుండి రోజుకు మాకుఁగావలసినన్నిమేకలఁ దెచ్చియిచ్చెదవా?

కాప : మీకు గొఱ్ఱెలతో నేమిపని? పాలకొఱకేకదా ?

సిపా : పాలెవరికిఁ గావలయును . వాఁటి మాంసముకొఱకు. దినమున కిరువది ముప్పది గొఱ్ఱెలనిచ్చితివా యొక్కొక్క దానికి నాలుగైదు వరహాలవంతున నిచ్చెదము.

సిపాయిలట్లు వచించిన వెంటనే జీవహింస యనినఁ గంటగించు కొనునట్టి యా యుత్తమ బ్రాహ్మణుఁడు చింతాక్రాంతుడై “హా! పవిత్రవంతమగు నార్యావర్తమున కెంత గతిపట్టినది. ఇదివరకు జరుగుచున్న వామమార్గులయల్లరులకే పడలేకయుండ నిప్పుడీ దుష్టులుగూడ ప్రాప్తించినారు. హా ! నోరులేని దనంపుమృగముల ఖండించి వానిపలలమునా వీరలు దినగోరుట ! ఇంతకన్న దమలో గొందఱి వధించియేల భక్షింపరాదు? ఇప్పుడు వీరివాక్యములకు సమ్మతించకున్న నన్నిక్కడనే కడఁదేర్తురు. దైవమా ! ఈ కఠినాత్ముల హృదయముల వజ్రములతో నిర్మించితివా ఏమి? లేకున్న వీరలకట్టి దుర్వాంఛ

16