ఈ పుట ఆమోదించబడ్డది

రాణీ సంయుక్త


శాస్త్రములను వాటి భాండాగారములను బేరులేకుండ జేయుడు అప్పుడు మనశాస్త్రములే వన్నె కెక్కును. వీరందఱు మనకే దాసులై వస్త్రంతు" రని నుడువ నెల్లరు పరమానంద భరితులై చప్పట్లు చరుచుచు లేచిరి. తమయేలికయొక్క యాజ్ఞానుసారముగ గుంపులుగఁ గూడి గ్రామములపైబడి నాశనము గావింప జొచ్చిరి. కొందఱు మ్లేచ్ఛులు వృద్ధులనక, బాలురనక, స్త్రీలనక, పురుషులనక కంటబడిన ప్రతిప్రాణిని గత్తికెరఁ జేయు చుండిరి. కొందఱు దుష్టులు యౌవనవతులగు కాంతల గొంపోయి తమ యిష్టానుసారము బాధింపగడగిరి. కొందఱు తులువలు పురుషులనందఱఁ బెడరెక్కలు విరిచికట్టి యొకచో నిలువఁబెట్టి వారి కనులయెదుర వారివారి తల్లుల నక్క,సెల్లెండ్ర భార్యలం జీరల విడిపించి భీభత్సము సేయుచుండ నా ఘోరముల జూడనోడి కన్నులు మూసుకొను వారిగ్రుడ్లను నారసములతో బెరికి పారవైచుచు, దలలు వంచుకొనువారి ఖడ్గ ప్రహరముల గడదేర్చుచుండిరి. మఱికొందఱు దుర్మార్గులు వృద్దులు పడుచువారలు నగుస్త్రీపురుషుల దిగంబరులు గావించి దండతాడనంబులతో బరుగెత్తించుచుండిరి. కొందఱు దుర్మతులు పెండ్లికాని పడుచుల దమచిత్తమువచ్చినచోట కెక్కడికో కొనిపోవ సాగిరి. మఱికొందఱు మాంసఖాదనులు సృష్టాదిగ వచ్చుచున్న సత్యగ్రంథముల ధ్వంసము కావింపసాగిరి. ప్రఖ్యాతి కెక్కిన భాండాగారములందలి గ్రంథ సంచయంబుల విశాలమగు నగ్నిగుండములదీసి వాటియందువైచి తగులబెట్టుచుండిరి. ఒకొక్కపుస్తకా

148