ఈ పుట ఆమోదించబడ్డది

ఇరువదియొకటవ ప్రకరణము


వైరము గలిగియున్నవి. మఱియు మనకరీమునకు బదులుగ భట్టుగారే మనకొఱకనేక ప్రయత్నములు జేయుచు నాకు వార్త లంపుచున్నారు. అందువలననే మనకిక్కడ నింతమాత్రము నిలుచుట కవకాశము దొరికినది. మొన్న చారులు కొందఱరుదెంచి కనూజియందు జయచంద్రుని పుత్రికకు వివాహము జరుగుచున్నదనియు జక్రవర్తి కవమానము గలుగఁ జేసినందున నతఁడా పురముపై నెత్తి రానున్నాడనియు వచించిపోయిరి. మరల నే సమాచారము దెలియలేదు. ఇత్తరి మీరలిదివరకు వలెగాక పెద్దపెద్ద గుంపులుగఁ గూడి బయలుదేరిపోయి గ్రామముల ధ్వంసము గావింపవలయును. మఱియు నీ యార్యావర్తము సమస్తశాస్త్రములకు బసిద్ధికెక్కినదని విందుము. పూర్వకాలమున నన్య ఖండములవారు సహిత మిచటికేతెంచి విద్యలనేర్చుకొని పోవుచుండువారఁట. ఈ కాలమున నీ దేశపు జనులు వాని విలువను దెలిసికొన నేరక రెండువందల సంవత్సరము లాదిగ జదువుట మానివేసిరి. గ్రంథములుమాత్రము మిగిలియున్నవి. ఒకవేళ ముందు వానినెవరైన జదివినచో మరల మననె త్తి కెక్కుదురు. కావున మీకంటబడిన ప్రతి పుస్తకభాండాగారమును దగులబెట్టి యార్యావర్తమును శాస్త్రవిహీనముగ గావింపుడు. రెండు శతాబ్దములనుండి వాని మొగముజూడకుండ నున్నారుగాన నీతరుణముననే ధ్వంసముఁజేయుట మంచిది. ఇఁక మీకు జెప్పవలసిన దేమున్నది. మీ యిష్టమువచ్చినట్లు రాత్రియనక పగలనక కృషిచేసి జనులనందఱ జిత్రహింసఁ బెట్టుడు. ముఖ్యముగ

147