ఈ పుట ఆమోదించబడ్డది

రాణీసంయుక్త


కేమిహేతువో యని సంభ్రమమందసాగిరి. కొందఱు మనము జాగరూకతతో బ్రవర్తించుచున్నామో లేదో యని బరీక్షింప నిట్లాకస్మికముగ వచ్చి యుండునని యూహించిరి. అనంతరము కొన్ని దినంబు లేగినపిదప యమునాతీరమున జరిగిన సంగతులన్ని యు గుతుబుద్దీన్ వారి కెఱింగించెను. తోడనే వారందఱు నుగ్రులై హుంకారము లొనర్చుచు లేచి యిప్పుడే ఢిల్లీ పై దండెత్తుదమని వక్కాణించిరి. అయిన వారిశాంతపఱచి కుతుబుద్దీన్ మెల్లన " సోదరులారా : ఆర్యావర్తరాజులపై నొంటిగ దండెత్తఁదగుతరుణ మింకను రాలేదు. మీకేకాదు. మన సేన నోడించిన చక్రవర్తియని తెలిసిననాటినుండి ఢిల్లీ నెపుడు మ్రింగుదునా యనునభిలాష నాకును మిక్కుటమై యున్నది. వీరింకను వారిలోవారు పోరాడుకొని నాశనము కావలయును . పదునొకండవ శతాబ్దారంభమున మన సుల్తాన్ మహ్మద్ గజనీ యీ దేశముపై దండెత్తివచ్చి జయించి లెక్కలేని ధనమును గొంపోయి లాహోరున స్వతంత్ర రాజ్యమేర్పఱచిన నాటినుండియు నీ రాజులెల్లరదివర కున్నటులేయుండక శాస్త్రాను కూలమగు రణశిక్ష సైనికులకు నేర్పించి సైన్యములను బాగుపరచుకొని యున్నారు. ఇప్పుడీ రాజులసేనలకు రెండింతలు మన పక్షమున నున్నను మనము వారిఁజయింప జాలము. ఏడెనిమిదేండ్ల క్రిందట జయచంద్రు జీవనసింహులు లాహోరు నుండి మనసుల్తానుగారి వెడలంగొట్టుటకు బ్రయత్నములుసేసి మరల నేకారణముననో మానివేసిరి. ఇప్పుడా రెండు రాజ్యములుపరస్పర

146