ఈ పుట ఆమోదించబడ్డది

ఇరువదియొకటవ ప్రకరణము

టులార్యా వర్తమున కంతయు సాధార భూతములైన ఢిల్లీ కన్యాకుబ్జ రాజ్యములు రెండును బరస్పర వైరంబులు పెచ్చు పెరుగఁ బోరాడు కొనుచున్న తరుణమందే కుతుబుద్దీనుచేఁ బ్రేరితులగు మ్లేచ్చులు దేశమందు జేయఁగడగిన క్రౌర్యములుఁ గణింప నలవికాకుండెను. ఆనా డట్లు చక్రవర్తిచే నోటువడి కుతుబుద్దీన్ పరువెత్తిపోయి యమునా తీరమున నొక దట్టమగు పొదరింటిలోపల బగలంతయుఁ బరుల కంటబడకుండా దాగుకొని చీఁకటిపడినపిదప బయటికేతెంచి నది నీది యావలిగట్టుఁ జేరి తనకు సంభవించిన దురవస్థంగూర్చి తలచుకొనుచు రోషావేశుడై యార్యావర్తము ధ్వంసముజేయఁ బట్టుపట్టి మఱియొక ప్రదేశమందిటులేని గూఢముగనున్న మహ్మదీయుల దండును జేరెను. అచటనున్న వారంద ఱిత డిట్లొంటరిగ జనుదెంచుట

145