ఈ పుట ఆమోదించబడ్డది

ఇరువదియవ ప్రకరణము


గాంచి దిగులుపడ నారంభించెను. ఎంతైనను బ్రచండుఁడు ధైర్యమువదలక ప్రోత్సాహంపు వచనముల దనవారి బురికొల్సుచునే యుండెను. పదునొకండు గంట లగునప్పటికి యుద్ధము మఱికొంత ఘోరమయ్యెను. తుఫాకులు ఫిరంగులు మొదలగువానివల్ల లేచుపొగయును నేలయందలి ధూళియును లేచి యేకమై గగనతలముగప్పి చీకట్లు గ్రమ్మ జేయుచుండెను. అట్టి యల్లకల్లోలమగు సమయమున మహామాయుం డతిచాతుర్యముతో దనసేనను దూర్పు ప్రక్కనున్న ఫిరంగులవద్దకు జేర్చి వానినన్నిటిఁ బ్రచండుని సేనవైపునకే ద్రిప్పించి కాల్పింప నారంభించెను. ఇటులీప్రక్కన వైరులకు సందుదొరకుటచేఁబ్రచండుఁ డించుక విచార మందసాగెను. అయినను జావునకు వెఱవక తనవారిబురిగొల్పుచునే యుండెను. అత్తరి బడమటి దిశనున్న సేనను నాశముఁజేసి ప్రకంపనుడు వ్యూహములోపల బ్రవేశించి ప్రచండుని మార్కొనెను. వారిరువురు బందూకులమాని ఖడ్గముల బూని ద్వంద్వ యుద్ధమున బోరాడఁగడగిరి. అట్టి స్థితిలో నెక్కడనుండియో తుపాకి గుండొకటి వచ్చి ప్రకంపమ నెడమ భుజమునకుఁ దగిలెను. ఈ వార్త నాతతాయి విన్న వెంటనే యతని రణమునుండి తొలగింప నాజ్ఞాపించెఁగాని యతడెవ్వరి మాటలను బాటింపక నా ప్రాణమున్నంతవరకు నేరణ మొనర్చుట మాననని పెచ్చు పెరిగిన రోషమున మఱియొక దీర్ఘమగు ఖడ్గముంబూని ప్రచండుని శిరోవేష్టనము నేలఁ బడఁగొట్టెను,

వేష్టనహీనుఁడైనను బ్రాణముల కాసింపక తెగించి ప్రచండుడు

143