ఈ పుట ఆమోదించబడ్డది

రాణీ సంయుక్త


నదియే సూచీవ్యూహము. తాము చనుచున్న మార్గమున కెదురుగ పిరంగులు మొదలగునవి పెట్టించియుండుట తెలిసికొని మహా మాయుడనువానికిఁ గొంతసేననిచ్చి సర్పవ్యూహమున వాని నాసనము గావింపఁ బంపెను. వైరుల కెరుకలేకుండ నేలపై బరుండి ప్రాకిపోయి పట్టుకొనుటే సర్పప్యూహమున ముట్టడించు టందురు. ఇట్లు మూఁడు ప్రక్కలకు మువ్వుర నంపి మిగిలిన సేనను వజ్రవ్యూహము క్రిందమార్చి నడిపించుకొనుచు నాతతాయి దక్షిణముదాకఁ జను దెంచు చుండెను. వీరందఱకు వెనుక నిపుణులగు సేనానులు కొందఱు సేనతోఁ జుట్టుగొలువ జక్రవర్తి పోవుచుండెను. అత్తరి బ్రభాత కాలమున నారుగంటలైనను సేనల పాదఘట్టనముల వలన లేచిన ధూళి యంతయు నుదయింపబోవు సూర్యునిగప్పి ప్రొద్దుదెలియకుండ జేయుచుండెను. అట్టి తరుణమున నా తతాయి వలన నేర్పఱుపబడిన నాలుగుసేనలు నొక్క పర్యాయముగఁ బ్రచండుని దాకి బందూకుల మ్రోయించిరి. శత్రువులు కంటబడిన వెంటనే ప్రచండుని సేనాభటులును సాహస ధైర్యములతోఁ బోరాడ దొడగిరి. ఒండొరుల బందూకుల ప్రయోగము లవలన ననేకులు భటులు గూలుచుండిరి. ప్రచుండుని నేన సార్వభౌమ వాహిని కంటె నెన్ని యో రెట్లు చిన్న దయ్యుఁ జక్రవర్తి మొదలగువారు సహితము మెచ్చుకొనునట్లు రణము సేయుచుండెను. ఈ గతి పగలు పదిగంటల పర్యంతము సందీక పెనంగు చుండెగాని యెంతటికిఁ దఱుగక తండ తండములుగనున్న వైరిసేనలం

142