ఈ పుట ఆమోదించబడ్డది

రాణీ సంయుక్త


పతి యను పేర బాలించు చుండును. వీనికి దోడుగ గహర కంఠీరవ ప్రచండు లనువారు పనిసేయు చుందురు. వీరిక్రింద నొక్కొక్క విధమగు సైన్యమునకు నాధిపత్యము వహించిన వారు మువ్వురు గలరు అందు సుబాహువు డనువాఁడు కుంజర యూధమునకును, ప్రమాథు డనువాఁ డశ్వసైన్యమునకును, నిర్గాంతుం డనువాడు పదాతి సేనకు నధిపతులై యుండిరి. వీరి క్రిందను నిట్లే యధికార క్రమమున ననేక నాయకులు కలరు. కడగొట్టువాని యధికారమున నూర్గురు భటులుందురు. జయచంద్రు డింతసేనతో దుర్గమును రక్షించుకొనుచు నొకవేళ జక్రవర్తిసైన్య మేతెంచుచున్న యెడదారిలోనే యడ్డగించుటకు గాను బ్రచండుని యాధీనమున నారువేల కుంజరములు. పదివేల తురంగములు, నిరువదివేల భటులుగల వాహినిం బంపెను. సేనంతయు నగరము వదలి యిరువదిమైళ్లు వచ్చిన పిదప దమ కెదురుగ దూర్పుదిక్కున మన్ను మిన్నేకమగునట్లు లేచి వెనుక నేమియు గానరాకుండ జేయుచు హోరుమనురావములతో బ్రచండ తరముగ దమవైపున కేతెంచుచున్న గాలిదుమారమును బ్రచండు డవలోకించి గొప్ప గాలివాన వచ్చుచున్నదను భ్రమను సేననక్కడనే యా పెను. అత్తరి ముందుబోయియున్న వేగులవా రరుదెంచి యావచ్చునది చక్రవర్తి సైన్యమని ప్రచండు కెఱుక పఱచిరి. తత్క్షణ మతఁడా స్థలము విశాలమగు బహిరంగప్రదేశ మగుటవలన శాత్రవులు చుట్టిముట్టిన నపాయకర మగునని తలపోసి సేనను వలయాకారముగదీర్చి పద్మ

140