ఈ పుట ఆమోదించబడ్డది

ఇరువదియవ ప్రకరణము


గోడ కలదు. యుద్ధ సమయమందు భటులీ చిన్న గోడ పైభాగమున బారులుదీరి నిలచి పెద్దగోడ గవాక్షములగుండ శత్రు సేనలపై నగ్నివర్షము గురిపించు చుందురు. మఱియు నర్ద పర్లాంగున కొక పెద్ద బురుజు గలదు. బురుజులన్నియు బలిష్టములై యెల్లవేళల ఫిరంగులతో గూడియుండును. ఈకోట లోపల నుచితస్థలంబుల నెనిమిది చిన్నకోటలు గలవు. జయచంద్రుని సైన్యమంతయు చిన్నకోటలం దనారతము నివసించు చుండును. కోట బహిర్దారము బలవత్తరమై నాల్గు బురుజుల మధ్యనుండెను. ఈద్వార మారుగజముల వెడల్పును బండ్రెండు గజముల యెత్తును గలిగి యుండెను. దీని తలుపులు స్వచ్ఛమగు నినుముతో నిర్మింపబడి మూరెడున్నర మందము గలిగి ముందరి భాగమున దీక్ష్ణములగు గుబ్బలచే దాపటములై యుండెను. ఈ ద్వారముపై విశాలమగు నొక రాతికట్టడము గలదు. అందుఁ బ్రవీణులగు ఫిరంగులఁ గాల్చువారు జాగరూకులై యెల్లపుడు గాచుకొని యుందురు. దీని తరువాత నిట్టివే మఱిరెండు ద్వారములు కలవు. ఇట్టి శాత్రవుల కభేద్యమగు నా దుర్గమునం దంతట నైన్యముల నిలిపి కోటగోడల యగ్రములందుగూడ నక్కడక్కడ ఫిరంగులఁ బెట్టించి జయచంద్రుడు జాగ్రత్తమై యుండెను. ఇతనివద్ద నెల్లవేళలందు నొక లక్ష యిరువదివేల కుంజరములును, నూటయేబదివేల తురంగములును, రెండులక్షల భటులును గలిగినసేన స్థిరముగ నుండును. ఈ మూడువిధముల సేన నుగ్రవర్మ యనువాడు సకలాక్షౌహిణీ

139