ఈ పుట ఆమోదించబడ్డది

రెండవ ప్రకరణము


నను నట్లే గొఱ్ఱెలఁ దోలుకొని పోయితిని. సాయంకాలమగు నప్పటికి మబ్బుపట్టి చినుకులారంభ మయ్యెను. పెద్దవర్షము కాకమునుపే కొంపఁజేరుకొనుట మంచిదని మందను నదిలో గుండా నడిపించుకొనుచు నింటికేగుచుంటిని. అత్తరిఁ బ్రవాహముసకు నిలువలేక రెండుమూఁడు గొఱ్ఱెపిల్లలు నీటఁబడి కొట్టుకొని పోవుచుండ వాటిం దక్కించుకొన నేనును నీట దుమికి యీదుకొని పోవుచుండ నదివర కారంభించిన చినుకులు మిక్కుటమై యాకస్మికముగఁ బెద్దవర్షము కురిసెను. చీకటులునుఁ గ్రమ్మెను. ఆ చీఁకటియందు గొఱ్ఱెలఁ గన్గొనలేక విసిగి తుదకు తీరమున కీదసాగితిని ఎంత యీదినను గార్యము లేక పోయెను క్రమక్రమముగఁ బ్రవాహమధికమై నన్ను వెనుకకే నెట్టివేయుచుండెను. కొంతసేపటికి నా యవయములన్నియు బలహీనములై నందునఁ గదలింపఁ జాలక మిన్నకుండ వలసిన వాఁడనైతిని, అనంతర మేమైనదియు నాకుఁ దెలియదు. మరల దెలివిగలిగి చూచునప్పటికి మీ రగుపించితిరి. మీరలే నా ప్రాణ దాతలని తలఁచెదను.”

అనివచించి తన యాలు బిడ్డలఁ దలఁపునకుఁ దెచ్చుకొని కపట దుఃఖమున నభిలయింప సాగెను. అదిచూచి ఒక సిపాయి " అరే! దివానా! ఇంచుకసేపుక్రింద మేము పైకిఁదీయకపోయి యుండిన నీ పాటికి మృతినొంది యుందువే. అప్పుడీ భార్యా పుత్రులేమగుదురో!" యని యడిగెను. అంతవాఁడు మరల " అయ్యా ! బ్రతికేయుండగనేకదా! యీ చింతలన్నియు, ”

15