ఈ పుట ఆమోదించబడ్డది

ఇరువదియవ ప్రకరణము

క్రవర్తికి లేఖనంపిన దినము మొదలు కనూజియందు జయచంద్రుడు దుర్గము బాగుచేయించుట మొదలగు రణ సన్నాహములగు కార్యములలో మగ్ను డై యుండెను. ఈ నగరమందలి కోట చదరమై పండ్రెండుమైళ్ల చుట్టుకొలత గలిగి యున్నది. ఇది పెద్దపెద్ద నల్లరాళ్లచే నిర్మింపబడి నేలమట్టమున నాలుగు గజముల వెడల్పును నగ్రమున గజమున్నర వెడల్పును గలిగి పరీఘాసమావృతంబగు పదునొకండు గజముల యెత్తుగల ప్రాకారపు గోడచే గూడుకొని యుండెను. గోడలచుట్టు పది గజముల యెత్తున తుపాకులు ఫిరంగులు మొదలగునవి ప్రయోగించుట కనువగు గవాక్షము లడుగడుగునకు బెట్టబడి యుండెను. ఈ గోడలతో గలిసియే లోపలి భాగమున మూడు గజముల మందమును దొమ్మిది గజముల యెత్తును గల మఱియొక రాతి

138