ఈ పుట ఆమోదించబడ్డది

పందొమ్మిదవ ప్రకరణము


మొదలగువారు చేయుచున్న కుట్రలు తెలిసినవి. వీరలు నిన్ను వధింప గొంపోవుచున్నారను వార్తవిని సూతుని వేషమూని వచ్చితిని. అమ్మా ! దుర్మార్గులు వచించు కల్లమాటలకులోనై యతఃపురమువిడచి యొంటరిగ నిట్లురానగునా? నేను సమయమునకు వచ్చియుండ నిన్ను రక్షింపగలిగితి. లేకున్న నీవేమగుదు" వన నాశ్చర్యకలితయై యా దుష్టుఁడగు భట్టుపన్నిన పన్నుగడకు విస్మయమందుచు మహాత్మా ! చక్రవర్తిపైఁగల మోహమున నిట్టికార్యముంజేయఁ బాల్పడితిని. ఆదియుంగాక చక్రవర్తికడకు మీరుకొనిపోయిన లేఖను దెచ్చి యీశ్వరభట్టు నాకు గనుబఱచుటవలన రూఢియని నమ్మి మోసపోయితివి . మీరు కైకొనిపోయినలేఖ యా దురాత్మునికడ కెట్లు వచ్చినది? అని సంయుక్త యడుగ దానిసమాచారము సావకాశముగ దెలిపెద గాని నీ విఁక ముందెన్నటికి నిట్లురాకుము. ఈశ్వరభట్టు నీతో మాటలాడిన సంగతులన్నియు వానికడనుండు కంచుకివలన వినియున్నాను. వాఁడుచెప్పినదంతయు వట్టియబద్ధము, చక్రవర్తి రేపో మాపో యుద్ధమునకు రానున్నాఁడట ఘోరసంగ్రామంబు జరుగనున్నది. పురుషవేషమూని నీవాచక్రవర్తి సేనకు దోడ్పడుచు సంగరమున నీ మనోకాంతుండు మెచ్చుకొను కార్య మే దైన సలిపితివా యతఁడు నిన్ను ఢిల్లీకి గొనిపోవును. నేను మరల ఢిల్లీ కేతెంచి నీ మవోవాంఛితంబు నెరవేర్చెదను. నేను వచ్చువరకు నీవృత్తాంత మెవరికిఁ దెలియ పఱచవలదు." అని బోధించి మరల నా బండియందే కూరుచుండ బెట్టుకొని యామె నంతఃపురముఁ జేర్చి తాను వెడలిపోయెను,

137