ఈ పుట ఆమోదించబడ్డది

రాణీ సంయుక్త


యించుక వెనుకకేగి బట్ట మొదలగునవి బాగుగ సవరించుకొని బండి వెనుకనుండి వచ్చి యొకప్రక్కనున్నవాని తలనెగర గొట్టెను. రెండవవాడుక్రిందికి దుమికి యెదురింప వచ్చుచుండ వానిని బట్టుకొని నేలంబడదన్ని గొంతుకపై గాలువైచి దుష్టాత్ములారా ! రాకుమారిక నన్యాయముగాఁ జంపనెంచితిరా? పరులకెగ్గుసేయ దలపెట్టిరి గావున నాప్రాప్తి మీకే చేకూరినది, చావుఁ " డని వానింగూడ గడదేర్చెను. ఇంతలో నీకల్లోల మంతయుంగాంచి బండిదిగివచ్చి సంయుక్త విస్మయాక్రాంతయై నిలచియుండెను. సూతుఁడామె సమీపింపఁబోవఁ గోపమూని “ దురాత్మా ! ఇట్లేలఁజేసితివిరా " యని తనదగ్గరనున్న యొక చిన్నకత్తితో నతని పొడువంబోగా "ఆఁ ! ఆగుము. నే దేవశర్మ "నని నిజకంఠస్వరమునఁ బలికెను. దేవశర్మ యనుట తోడనే కత్తినాపి "యీ చీకటిలో నేనెట్లు గుర్తిడగలను. దేవశర్మయైననాకింత ద్రోహముఁ గలుగజేయ"డని యాకన్నియ పలుక బండిముందరి దీపమును వెలిగించిచూడు మని సూతుఁడు వక్కాణించెను. సంయుక్త దీపమువెలుఁగున సూతవేషముతో నున్న తనగురువును దేవశర్మం గుర్తించి తనచేతనున్న ఖడ్గము నవతలఁ బారవైచి యతని పాదములపైఁబడి " మహాత్మా ! ఎన్ని దినంబులకు భవదీయ దర్శనమబ్బెను ! మీ చరిత్రముం జూడ నాకాశ్చర్యము గలుగుచున్నది. మీకీబండివాని వేషమేలచేకూరె వీరల నేటికిట్లు వధించితి " రన " బిడ్డా : నే నీ దినముననే యీ గ్రామమున కేతెంచితిని. వచ్చినవెంటనే యీశ్వరభట్టు

136