ఈ పుట ఆమోదించబడ్డది

పందొమ్మిదవ ప్రకరణము


నీయవలదు. అటు లొనర్చితివా నీ ప్రాణములు నీవి కా " వన " మహాప్రభో ! ఏలినవారియాజ్ఞకు భిన్నముగా నడచుకొందునా? యని సమ్మతించెను, పండ్రెండు గంటలగుడు సంయుక్త మేడ మీదనుండి బండివచ్చి సిద్ధముగనుండుట దెలుసుకొని తానిదివర కేర్పరచుకొని యుంచుకొన్న రహస్యమార్గమునఁ జనుదెంచి బండికడ నిలచెను. నిలచిన వెంటనే భట్టుగారుచూచి నమస్కరించి లోపల నొకప్రక్క నాసీనంజేసి మిత్రులను సూతుని స్థలమున గూరుచుండజేసి దీపములఁ దీయించి తానును లోపల నొకవైపునఁ గూరుచుండి బండిని మధురాపురము దారిబోనియ్య నాజ్ఞాపించెను. మైలుదూర మరిగినపిదప దానొక వస్తువు నింటికడ మఱచి వచ్చితిననియు నొకనిమిషములో దానిఁజేకొని వచ్చెద ననియు సంయుక్తకుజెప్పి బండిని మెల్లగ బోనిచ్చు చుండుమని సూతునకాజ్ఞాపించి తాను వెనుకకు మరలిపోయెను. భట్టుగారు చనిన పిమ్మట మఱియొక మైలు వరకు బండినిబోనిచ్చి యప్పటికి నతఁడు తిరిగి రానందునఁ దన ప్రక్కనున్నవారి " ఏమి !మీ యజమానుఁడు గారింకనురాలేదని" సూతుఁడడుగ నా యిద్దఱు రహస్యముగ " భట్టుగారికరారు. నీవు త్వరితముగ బండి నింకొక మైలుదూరము పోనిమ్ము. మనమీ బండియందలి కన్నియను జంపవలయు " నన సూతుండు దనలో “ఔరా ! దుర్మార్గులారా : మీయూహ" యని భట్టుగారు తప్పించుకొని పోయి నందులకు లోలోపల నొచ్చుకొనుచు ముందేగిన నేమగునో యనుతలంపున దానక్కడ దిగవలయునని వారితోఁజెప్పి దిగి

135