ఈ పుట ఆమోదించబడ్డది

పందొమ్మిదవ ప్రకరణము

దేవశర్మ వచించిన ప్రకారము కంచుకిపోయి భట్టుగారితో బండిని గుదుర్చుకొని రాత్రి పదిగంటలైనపిదప మనమందిరము వద్దకు గొనిరమ్మనివచ్చితి నన నతని బంపి దనకు జేదోడుగనున్న మిత్రుల నిరువురను బిలిపించి జరిగిన సంగతులన్నియు వారితో జెప్పి చేయవలసిన కార్యమునకై వా రిద్దఱికి మారువేషముల వేయించి ప్రొద్దుగ్రుంకిన పిదప బదిగంటలైన దాది బండికొరకై కనుపెట్టుకొని యుండెను. అత్తరి సూతుండొకఁడు బండిదోలుకొనివచ్చి బయట నున్నాఁడని సేవకులెఱుగింప నా యిద్దఱు మిత్రులతో వచ్చి బండియెక్కి సంయుక్త యుండు ప్రాసాదము వైపునకు నడిపించి యక్కడ నాపి సూతునివద్దకేగి వానిచేత కొంతధనమిచ్చి "ఓరీ! నీకింకను గావలసిన ధనమిచ్చెదను. నేడు నీబండియందు జరుగు సమాచారము లెక్కడను దెలియ

134