ఈ పుట ఆమోదించబడ్డది

పదునెనిమిదవ ప్రకరణము


పంపితిరఁట. దీని నానవాలుగ గనుబఱచి మిమ్ముఁ దోడ్కొని రమ్మని పంపినాఁ" డనెను. ఆ లేఖను జూచుకొని సంయుక్త సంతోషభరితయై భట్టుగారితో అయ్యా! మీ యిష్టానుసారము నడచుకొన సిద్ధముగ నున్నా" నని పలికెను. కాముక జనంబులకు యుక్తాయుక్త వివేచనము శూన్యంబుగదా ! అంత మరల నతఁడు " అమ్మా ! మనమీరాత్రియే బయలు దేరి పోవలయును. సుమారు పండ్రెండు గంటలకు వెడలుదము. అప్పటికి సంసిద్ధురాలవై యుండుమనిచెప్పి తాను వెనక్కు మరలెను. అతఁడు వచ్చువేళకు నేను ముందుజని యతఁ డుంచిపోయన ద్వారము కడనుండ నన్ను గలుసుకొని రహస్యముగ రాత్రికొక బండిని గుదుర్చుకొని రమ్మని చెప్పి తనదారిం బోయెను. ఇందుకు మీరేమీ ప్రతీకారము చెప్పెదరోయని వెంటనేయిక్కడి కి వచ్చితినని యావదృత్తాంత మెరుక బఱుప “ ఔరా ! కుట్రముండ వాఁడెంతపనిఁ జేయఁబూనినాఁడని యాశ్చర్యపడుచు దేవశర్మ బండిని గుదుర్చుకొని వచ్చితినని భటులతో జెప్పుమని కంచుకిం బంపి " వినయశీలా ! మన నగరమందెట్టి రాజద్రోహులున్నారో చూచితివా? కానిమ్ము. ఆ దుష్టులుమువ్వురు వచ్చుట తటస్థించినచో నేడే కడముట్టించెదనని మఱికొన్ని రహస్యము లతని చెవిలోజెప్పి తాను వెడలిపోయెను.

133