ఈ పుట ఆమోదించబడ్డది

రాణీ సంయుక్త


సమాచారము దెల్పుటకు వలను కలుగదనియు, నీతోమాట్లాడి నిన్ను గొనిపోవకున్న నా మిత్రునికోరిక నెరవేరదన్న భయము నను నీతండ్రికి గల్పితలేఖ నొకదానిని గనుబఱచి మఱికొన్ని యిచ్చకములు పలికి యితని దయకుఁ బాత్రుఁడనైతిని. నీతండ్రి చేయుచున్న సన్నాహములఁ జూచి చక్రవర్తి దాడివెడలి వచ్చునని తలఁచెదవేమో ? జయచంద్రుఁడు వ్రాసిపంపిన యుత్తర మప్పుడే యే పెంటలోనో కలిసిపోయి యుండును, చక్రవర్తి మన యిద్దరి రాకకొరకై యెదురు చూచుచుండును. ఇప్పుడు నీతో నున్న సంగతులన్నియు వచించితి. ఇక నీ యిష్టానుసార మేమిచేయుమన్న నట్లుచేయుటకు సిద్ధముగ నున్నా " నని నమ్మకము కలుగునట్లు తియ్యని మాటలతో వచింప నా కన్నియ తా నదివరకు బూనియున్న కోపమును విడచి మెల్లన "నయ్యా! మీరిదివరకు గావించుచున్న కార్యముల వలననే నన్యముగ భావించితి. కాని యిప్పుడు మీరు చెప్పినదంతయు నిక్కువమేకదా? యని యడిగెను. భట్టుగారామె దారిలోనికి వచ్చుచుండుట గనిపెట్టి మరల "తల్లీ ! చక్రవర్తినివి కాబోవుచున్నావు కాన నీవు కేవలము ధీరమాత వగుదువు. నీ యెడ ద్రోహము దలపెట్టినవాఁ డెట్టిఘోర నరకమైన నొందుఁగాక. నా మిత్రునివాంఛ దీర్పనెంచి నే నెన్నియో టక్కులఁ బన్నితిని. అమ్మా ! ఆట్లు చేయనియెడల నా కిచట బ్రవేశము గలుగనే కలుగదు." ఆని నుడివి యొక కమ్మ నామె కొసంగి " అమ్మా! దీనిని మీరు నా నెయ్యునకు వ్రాసి

132