ఈ పుట ఆమోదించబడ్డది

పదునెనిమిదవ ప్రకరణము


"భట్టుగారూ ! ఏ మిట్లుదయచేసితిరి? చక్రవర్తిగారి వద్దనుండి మాతండ్రికడకు మఱేవైన జాబులు వచ్చినవా? యని నిష్టూరముగఁ బల్క నితడు ముసిముసి నవ్వులు నవ్వుచు "అమ్మా! మీ నాయనగారికి నే నగుపఱచిన లేఖను నీవును నిజమని నమ్మితివా? నాపై నెటులైన నమ్మకము కలుగుటకుగా నట్టి లేఖలఁ గల్పించి చూపించితిగాని వేరొండు కాదు. ఇప్పుడు నీకడ ప్రమాణపూర్వకముగ నిక్కమగుదానిని వచించెదవినుము జక్రవర్తికిని నాకును బరమమైత్రి. అతఁ డహోరాత్రంబులు నిన్నుగూర్చి తలఁచుకొనుచుఁ దుదకు నన్నుబిలచి మిత్రమా ! నా కెటులైన సంయుక్తనుగూర్చి నా వంతఁ దీర్పజాలవా ? నీవంటినెయ్యుఁడు నాకు మఱియెకండు దొరుకఁడుగాన నీతో వచించుచున్నాను. ఆ తన్వి వీక్షింపకున్న నా యసువుల భరింపనోప" నని దీనత్వముతో పలికిన నతని మాటలకు నా హృదయము కఱగి "చీ! మిత్రునభీష్టంబు దీర్పజాలని సౌజన్మమేలనని కొంతతడవు విచారించి యతనితోఁ గానిమ్ము ! నీ కోరిక నెరవేర్చెదను. ఇటులే యింకను గొన్ని దినములవరకు నోపిక బట్టియుండుము. నే గన్యాకుబ్జ నగరమునకేగి సంయుక్తం గొని తెచ్చెదను. జయచంద్రుని దగ్గరనుండి యొకవేళ నీ కేవిధమైన యుత్తరములు వచ్చినను వాని లెక్క గొనకుము." అని యతని సమ్మతిపరచి యీ పురముజేరితిని. మొదలే జక్రవర్తిపై వైర మూనియున్న నీతండ్రికిఁ దగినట్లు మాట్లాడనిచో నాకీరాజ్యమున నిలువ వీలుకలుగదనియు, నిలువకున్న నీతో నా మిత్రు

131