ఈ పుట ఆమోదించబడ్డది

రాణీ సంయుక్త


క్షేమసమాచార మడిగి కూరుచుండ నియోగించెసు, అత్తరి వినయశీలుండు దేవశర్మతో " ఈ కంచుకి మనకు బరమాప్తుడు ఇతఁడు పైకి దుష్టత్రయమునకు మిత్రుడుగనుండి వారి సమాచారములన్నియు నాకుఁ దెల్పుచుండును.” అని కంచుకివంకఁ దిరిగి " నేఁడేమైన నూత్న వృత్తాంతములున్నవా ! నీ వెప్పుడును రానీయకాలమున వచ్చితి " వన "మహాప్రభో ! వారు చివరకు జయచంద్రునకే మోసము గావింపఁ బూనుకొన్నారు. ఇంకేమున్నది? వారు సంయుక్తా దేవినిం జంపు ప్రయత్నములు చేయుచున్నారు." అని కంచుకి పలుక " ఎట్లు ! సంయుక్త నే ! హా ! నాప్రాణములుండ నా ముద్దు బిడ్డ కట్టి యపాయము రానిత్తునా? యని దేవశర్మ ధీరముగ వక్కాణించెను. అంత నా సంగతులేమో వివరముగ వచింపుమన గంచుకి యిట్లనియె --

“కడచినరాత్రియం దాదుష్టులు మువ్వురు నొక రహస్యంపుఁ జోటఁజేరి మూడుగంటలసేపు సంయుక్తను గడ దేర్చు పన్నుగడలు పన్నుకొని యెవరిండ్లకు వారు వెడలిపోయిరి. ఈశ్వరభట్టు తెల్లవారినతోడనే నన్ను వెంటగొని సంయుక్త యుండు నతఃపుర మందిరములోనికిఁ జని ద్వారముకడ నన్నుంచి తాను లోపలికరిగెను. నేనును వానికి దెలియకుండ వెంటనేపోయి తలుపుచాటున దాగుకొనియుంటిని. సంయుక్త యొంటరిగ నొక సోఫాపైఁ గూరుచుండియుండెను. భట్టుగా రామెనుగాంచినంతనే సాగిలఁబడి నమస్కారము చేసెను. అత్తరి సంయుక్త

130