ఈ పుట ఆమోదించబడ్డది

పదునెనిమిదవ ప్రకరణము


గావున నుంచినాడు గాని యనేకుల కిదివఱకే యుద్వాసన యైనది." అని యీశ్వరభట్టును గురించి వచించుటతోడనే దేవశర్మ యాశ్చర్యమగ్నుడై “ఆహా ! ఆ దుష్టుఁడు ఢిల్లీ నంతయు నాశనముఁజేసి యిక్కడఁ జేరినాడా? ఇక జయచంద్రుఁడు బాగుపడుట దుర్లభమే. ఈ క్రూరుఁ డిదివరకే ప్రాణహత్య గావించుకొనె నని తలఁచియుంటిని. ఇప్పుడీ వార్తవలన నా కమితమగు చింతగలుగుచున్నది. ఆ మువ్వురను రాజున కెఱుకలేకుండ నెటులైనఁ గడముట్టింపవలయును. ఇప్పుడు వారు చేయుచున్న పనియే " మన " ఏమున్నది? ఆ భట్టుగారు చక్రవర్తి లిఖించినదని యొక బాబును దెచ్చి జయచంద్రున కిచ్చినాఁడు. దానిఁ జూచుకొని సృపుఁడు కోపోద్దీపితుడై వెంటనే జక్రవర్తి కొడలు మండునట్టు ఒకలేఖ వ్రాసిపంపినాడు. అది చక్రవర్తికి జేరియేయుండును రేపోమాపో మన నగరముపై దండెత్తి రాగలడు. అందుకొఱకే జయచంద్రు డిప్పుడు రణమునకు వలయు సన్నాహంబులఁ జేయించు చున్నాడు." అని వినయశీలుఁడు వక్కాణించెను. ఇక్కడ వీరిరువు రెట్లు మాటలాడుకొనుచున్న సమయమున బయట ద్వారముకడ నెవరో పిలుచుచున్నట్లు శబ్దమురా వినయశీలుఁడు చని తలుపుదీసి చూడ గంచుకివచ్చి నిలిచియుండెను. అంత వారిద్దరు మరల దలుపు పెట్టుకొని దేవశర్మ దగ్గరకు వచ్చిరి. కంచుకి దేవశర్మను గావించుకొనుటతోడనే యానందమును బొంది యతనికి నమస్కరించి నిలువ నా విప్రుఁడును నతని

129