ఈ పుట ఆమోదించబడ్డది

రాణీ సంయుక్త


సిపా : సరియే. సమయము వచ్చినపుడు మాత్రము నేను సహాయమునకు వచ్చువాఁడనుగాను,

నాయ : పోరా ! నీలాటి దివానాలు సహాయ మొనరించిననెంత ! యొనరింపకున్న నెంత !

అన వాఁ డావలకు వెడలిపోయెను. కొంత సేపటికి నీట దొరకినవాఁడు కనులు దెఱచి చుట్టుపట్ల నున్నవారి నవలోకించుచుఁ బొట్టఁ జూపించి నైగఁ జేయ నదివారు గ్రహించి తమ దగ్గరనున్న గోదుమపిండిని దెచ్చి యా నెగడి మీదనే జావగాఁ గాచి వేడివేడిజావ వానినోటఁబోయ మ్రింగసాగెను. అట్లు వాడు వలదను నంతవరకుఁ బోసి పిదప గిన్నె నావలనిడి యొండొరులతో ముచ్చడించుకొనుచుఁ గూరుచుండి యుండిరి. జావ కడుపులోఁబడిన కొంతసేపటికి శక్తివచ్చి యా మనుజుడు బాగుగఁ గనులఁ దెఱచి చెంతనున్న సిపాయిలఁగాంచి భయం పడసాగెను. అందులకు వారు భయపడవలదని వానితోఁజెప్పి నీ వెవఁడవని యడిగిరి. అందుపై వాఁ డిదివరకు దప్పించుకొని వచ్చిన సిపాయిల వేషములును వీరి వేషములును నొకటిగఁ గాన్పించినందున వారు వీ రొకటియేనని తలచి తిన నిజవృత్తాంతము వెలిబఱచినచో దనకక్కడనే మృతికలుగునని యీ క్రింది రీతిగఁ దన సంగతి వచింపసాగెను.

" అయ్యా! నేను మధురానగరమున నొక గొఱ్ఱెల కాపరిని. నది యెండిపోయి యుండు కాలమున దానిదాటి యావలి గట్టున ననుదినము నామందను మేపుకొనుచుందును. ఈ దినము

14