ఈ పుట ఆమోదించబడ్డది

రాణీ సంయుక్త


కమితమగు ప్రేమయు, భక్తియు గలదు. జయచంద్రుడు సహిత మితని విద్యానైపుణ్యమునకు మెచ్చి యందఱకన్న నెక్కుడుగ గౌరవించుచుండును. ప్రధానమంత్రికి నితనికి నమితస్నేహము. దేవశర్మ మున్ముందు వినయశీలుని మందిరమునకేగ నతడును గాంచినంతనే లేచివచ్చి యాలింగన మొనరించుకొని లోనికిఁ గొంపోయి కూరుచుండబెట్టుకొని యాదరణ పూర్వకముగ క్షేమసమాచారము అడిగి తెలుసుకొని కొంతతడవునకు "దేవశర్మా ! నీ వింత కాలమైనను రాకుండుట వలన నా కేమేమో యాలోచనలు పోయినవి. నిన్ను సురక్షితముగ మఱల నా కగపఱచి నందుల దైవము కనేకవందనములు. నీ వేయే స్థలములం దింతకాలము వరకుఁ గ్రుమ్మరుచుంటి" వన నా వృత్తాంతమంతయు నిపుడు చెప్పుటగాదు. సావకాశముగ దెలిపెదను. నగరమందలి విశేషములేమి? సంయుక్త బాగుగనున్నదా యని దేవశర్మ యడిగెను. అంత వినయశీలుడు "రాజ్యమందలి వృత్తాంతము లన్నియుఁ బెద్ద భారతముగ నున్నవి. నీవు పోయిన తరువాత నీశ్వరభట్టను నతఁడొకడు ఢిల్లీనుండివచ్చి మన జయచంద్రుని దయకుఁ బాత్రుఁడై దుష్ట ద్వయముతో గలసి యనేక దుష్కార్యములు గావింపు చున్నాడు. వారు మువ్వురు గలసి చేయుచున్న కుతంత్రము లిట్టివని వచింపజాలను. నేనేమి చేయుదును. జయచంద్రుడును వారి స్తోత్రపాఠముల కుబ్బిపోయి వారి యిష్టానుసారమే నడచు కొనునుగాని నా మాటఁ బాటింపఁడు. ఏవోపూర్వకాలపు వాడను

128