ఈ పుట ఆమోదించబడ్డది

పదునెనిమిదవ ప్రకరణము


దంతట దమప్రభావమే సాగుచుండ మెలంగుచున్న తరి వారికడనున్న నొక ముదుసలి కంచుకి మాత్రము వారలు కావించు పనుల కిష్టములేనివాడై యుండెను. లోపల నిష్టములేని వాఁడయ్యు బైకిమాత్ర మగుపడక శాంతము వహించియుండి యా దుష్టుల కెఱుకలేకుండ చేతనైనంత వట్టుకు వారి కుట్రలకు విఘ్నములఁ గల్పించుచుండెను, బహిరంగముగను నీ దుష్టుల యెడల వైరమూని రాజు నన్యాయముగ నాశనము సేయు చున్నారన తలచి ప్రధానమంత్రియగు వినయశీలుఁ డనేక పర్యాయములు జయచంద్రునకు మంచిమార్గ ముపదేశింపుచు వచ్చెఁగాని చక్రవర్తియెడ రోషము వహించి యసూయా పరుఁడై యున్న నతని మనసున నా మాటలు నాటవయ్యెను. దుష్టత్రయమును బ్రధానమంత్రి తమ యెడఁ జేయుచున్న ద్రోహమున కతని దొలఁగించుమన రాజుతో ననేక పర్యాయములు వచించిరిగాని తండ్రినాటి నుండివచ్చుచున్న మంత్రిని దీసివేయుట కతడునుసమ్మతింప డయ్యెను, అట్టియెడ వీరలుగావించు తంత్రము లెప్పటివప్పుడు వినయశీలునకు దెలియపఱచి యతడు. చెప్పునట్లు విఘ్నములు కల్పించుచు దుష్టత్రయమునకు మాత్ర మావంతయైనఁ దనపై సందేహము పొడమకుండునట్లు కంచుకి ప్రవర్తించుచుండెను. . ఈ సమయమందే గ్రామాంతరమునకేగి కొద్ది దినములలో మఱలి వచ్చెదనని చెప్పి కొన్ని మాసములు కడచినను రానట్టి దేవశర్మ యను బ్రాహ్మణుఁ డేతెంచెను. ఈ దేవశర్మయే సంయుక్త విద్యాగురువు. ఇతనియెడ నామె

127