ఈ పుట ఆమోదించబడ్డది

పదునెనిమిదవ ప్రకరణము

శ్వరభట్టు కన్యాకుబ్జముజేరి కొన్నిదినములు జననిచ్చి మరల దన పూర్వపు దుర్మార్గములఁ జేయ నారంభించెను. ఎటులైన జయచంద్రునిచేత బృధివీరాజు నోడించి యతనిచే ఢిల్లీనందు కొంతభాగము బహుమానముగ బడయ నభిలాష గలిగి యుండెను. అట్టి యుద్దేశముతో ననారతము జక్రవర్తిపై లేనిపోని వార్తలఁ గల్పించి చెప్పుచు జయచంద్రునకు గోప మెక్కించు చుండెను. వీని నడతఁ గుఱించి సాక్ష్యమొసంగిన తక్కిన యిద్దఱు వీనితో గలసి పనిచేయుచుండిరి. ఈ దుష్టత్రయము రాజుచే నమితముగ భ్రేమింప బడుచుండుట వలన రాజ్యమందలి గొప్పగొప్ప యధికారులు సహితము వీనికి వెఱచుచుండిరి. అధికారుల సంగతియే యటులుండ నిక తక్కిన ప్రజల గుఱించి వచింపనేటికి? దుష్టత్రయము కనూజియం

126