ఈ పుట ఆమోదించబడ్డది

పదునేడవ ప్రకరణము


కించి “మీ మీ సేనల సన్నాహ పరచుకొని యప్రమత్తులరై నే లేనికాలమున మన దుర్గమతి జాగ్రత్తతోడఁ గాపాడు చుండుడు. ప్రస్తుతము నాతోఁగూడ నా తతాయి చనుదెంచు " నని మంత్రులవంకదిరిగి "మీరు యుద్ధమునకు వలసిన వస్తు సామగ్రుల ముందుఁబంపి దారియం దచ్చటచ్చట నాగియుండ వలయునని సేవకులకు జెప్పి పంపుడు, నే లేనితరి మహమ్మదీయ ఖైదీలను, కరీమును జాగ్రత్తమై కాపాడుడు. అని తగినట్టు లందఱ కాజ్ఞాపించి మూడుదినములకు యుద్ధప్రయాణ మేర్పఱచి వెడలిపోయెను. '

125