ఈ పుట ఆమోదించబడ్డది

రాణి సంయుక్త

"నూతనముగ ఢిల్లీనింగొని చక్రవర్తి యనుపేరు పెట్టుకొన్న పృథివీరాజుగారికిఁ గన్యాకుబ్జ నగరాధీశుండగు జయచంద్రుఁడ్రు తెలియపరచు విషయములు :-

నీవు రాజ్యమందల్లరులు సాగించి జనసంచయముల హింసించుచున్నావని వినియు వాటికి నాకు నేమాత్రము సంబంధము లేనందున నూరకుంటిని. ఇప్పుడు నాకడకంపించిన లేఖవలన నీసమాచారమంతయుఁ బూర్తిగ వెల్లడియైనది. “నీవు నాతో మైత్రిఁ బాటింపఁ దలచితివా సంయుక్తను నాకొసంగుము. లేకున్న రాక్షస వివాహమునైనఁ గైకొనెద, "నని బింకములు పలికి వ్రాసియున్నావు. నీతో మైత్రి పాటింపకున్న నాకు బ్రతుకు దెరువులేదని దలఁచితివా? చేతనైన పక్షమున నట్టిమాటలతోఁ గాక క్రియఁగనుఁబఱచి నాకూతుఁగైకొనుము. అందులకునే వెనుదీయవాడఁగాను. సర్వసిద్ధుఁడనై యున్నాను.

"జయచంద్రుఁడు"

అని చదువుచున్నంత సేపు నక్షౌహిణీపతులు రోషావేశులై చూచుచు కూరుచుండిరి. చక్రవర్తియు నాగ్రహవ్యగ్రుఁడై కోపము బైటరాకుండా నాపుకొని " విజ్ఞానశీలా ! ఇప్పుడు నీవే మనియెదవు ?" అన నిత్తరి నే మఱియొకవిధముగ విన్న వింతునే ? దేవరచిత్తానుసారము చేయవచ్చును. ఇంతకు మన దేశమున కిడుములు ప్రాప్తింపనున్న వి కాఁబోలు ? అందువలననే జయచంద్రునకిట్టి బుద్ధిపుట్టినది. అని వచించి విజ్ఞానశీలు డూరకుండెను, అంత జక్రవర్తిలేచి యక్షౌహిణీపతుల నవలో

124