ఈ పుట ఆమోదించబడ్డది

పదునేడవ ప్రకరణము


వెడలుదమనిరి. అత్తరి వారి నాపి ప్రధానియగు విజ్ఞానశీలుఁడు లేచి “రాజా ! పట్టుపట్టుమని తలఁచుకొన్నపుడెల్ల యుద్ధమున కేగుచుంటిమా యందువలన నమితమగు నష్టమగును. గౌరవము చెడును. అనుకొన్నపుడంతయు బోవుచుండుట వలన నొకవేళ నపజయము గలిగినను గలుగవచ్చును. సామదానభేదదండము లందు సామమున నెప్పటికిఁ గార్యములు చక్కపఱచుకొన నగును గాని ముందుగ దండమునకు దిగు టుచితముకాదు. మఱియు రణకారణమున ద్రవ్యనష్టమును వేలకొలది ప్రజా నష్టమును గలుగును. మొన్న మొన్ననే మహమ్మదీయులపై నెత్తివచ్చిరి. మరల నింతలో తొందరపడనేల? అదియుంగాక స్వదేశమందలి రాజు లొకరితో నొకరు పోరాడుకొనుచున్న పరదేశముల వారికి మిక్కిలి యలసగును, కావున జయచంద్రుని సమాచారమేమో యింకను గనుగొందము. ఇంచుక యోపిక పట్టి యుండుడు. అని వచింపఁ జక్రవర్తి వేరొండుపలుకనోడి యూరకున్న సమయమున బ్రతిహారియొకఁ డేతెంచి కన్యాకుబ్దమునుండి రాయబారి వచ్చి ద్వారమునఁ గాచుకొని యున్నాడని తెలుప నతని గొనిరమ్మన బ్రతిహారి యట్లే యొనరించి వెడలిపోయెను. వచ్చిన రాయబారి యుచితాసనం బంగీకరించి జయచంద్రుఁ డంపిన లేఖ రాజుగారి కొసగెను. చక్రవర్తి తన దగ్గరనున్న వేరొకనికిచ్చి చదువుమన నాతఁడిట్లు చదువ నారంభించెను.

123