ఈ పుట ఆమోదించబడ్డది

రాణీ సంయుక్త


యార్బాటములు చూచినను జయచంద్రుని మూర్ఖత్వము జూచినను నీ యార్యావర్తమునకు ఘోరసంగ్రామంబు పొడమునను యూహ కలుగుచున్నది. ప్రస్తుతము నిలువయున్న సైన్యములనే నమ్ముకొని యుండక నీ రాజ్యమందలి యౌవనవంతుల నందఱి రప్పించి వారికి యుద్ధశిక్షణ నేర్పించి యుంచుకొనుము. నే నెట్లునుపోవక తప్పదుగాన నాకు సెలవొసంగమన నెట్టకేలకు నాలుగు దినము లుండిపోవుటకు సమ్మతించెను. సంయుక్త సమాచారము వెలిబుచ్చిన పిమ్మట నా రాజున కామెపై ననురాగము కలిగినది లేనిది తెలుసుకొనుటకై నాలుగు దినముల వరకు నుండి యతని రహస్యవృత్తములవలన నామెయందు బద్దానురాగుఁడైనట్లు గ్రహించి యావల నతని యనుమంతంబు గొని బైరాగి వెడలిపోయెను. అతఁడేగిన దాది జక్రవర్తియు జింతాకులుఁడై మనము నంతయు సంయుక్తమీద నిడుకొని యామె నెట్లు బెండ్లాడ వలనుపడునా యని తలపోయు చుండెను. ఇట్లు దీర్ఘాలోచనపరుండై కాలమెట్లోగడుపుచుండ నదివరకే దేశములమీదఁ బోయియున్న చారులు కొందఱరుదెంచి కన్యాకుబ్జమున జరిగిన సమస్త వృత్తాంతముల నెఱుకపఱచిరి. అత్తరి జయచంద్రుఁడు చేసిన పనికి రోషమును సంయుక్త కావించిన దానికి మహానందమును గలుగ మఱునాఁడు కొలువుకూటమున మంత్రులు, దండనాయకులు మొదలగు వారందఱు పరివేష్టించి యుండ వేగులవారు తెచ్చిన సమాచారముల వెల్లడించి యేమి నేయుదమన గొందఱు దండనాయకులు జయచంద్రునిపై దాడి

122