ఈ పుట ఆమోదించబడ్డది

పదునేడవ ప్రకరణము


భంగమయ్యెనని ప్రాణములఁ ద్యజించుగాని బ్రతికియుండ నేరదు. ఈ వృత్తాంతము మీ కెఱుకపఱచుటకై నేనెన్ని యో కష్టములంది వచ్చితి ఇక నాలుగుదినములుమాత్ర మీ నగరమున నుండెద. అనంతరము నాకు సెలవొసంగవలయునని వేడ నింతవరకు గనురెప్పలు వ్రాల్చక బైరాగివంకనే చూచుచు నతడు వచించుదాని వినుచున్న చక్రవర్తి దిగ్గునలేచి యతని హస్తములు పట్టికొని మహాత్మా ! నీవు కేవలము నాపాలిభాగ్య దేవతవుగాని వేరొండుగాదు. కొంచెమెడమైన నట్టేటం గలసి పోవునట్టి నా రాజ్యము నుద్దరించి పుణ్యంబు గట్టుకొంటివి. సంయుక్త గుణసౌందర్యాదులఁగూర్చి వినియున్నందున నిదివరకే ప్రేమంపుబీజము మొలగలెత్తి యుండెగాని యా కోరికయీ నడుమ నా కన్నియ మనంబు తెలియమిని. మా రెండు రాజ్యములకుఁ గల వైరమునను నించుకవాడఁ బారియుండెను. ఇత్తరి మీ వాక్యామృత ధారలచే మఱల రేకెత్తుచున్నది. మీవంటి యుత్తము లేకడకేగిన నే కొదువలు గలుగవు గాని యైనను నా మనవి జిత్తగించి నారాజ్యమందే వసింపుడు " అని నెయ్యము తొలూకాడఁ బలికిన రాజు వాక్యములకు సంతుష్ట మానసుడై బైరాగి మరలనిట్లనియె, “రాజచంద్రా ! నీ రాజ్యము నందుండుటకు నా కేయాటంకములు లేవుగాని నేనింకను గొన్నికార్యములు నెరవేర్పవలసియున్నది. నే మరల మిమ్ముఁగలసి కొనియెదను. నీవు మాత్రము జాగరూకుఁడవై సకలసైన్యముల నాయత్త పఱచుకొని యుంచుకొనుము. మహమ్మదీయుల

121