ఈ పుట ఆమోదించబడ్డది

రెండవ ప్రకరణము


జుట్టుఁ గూరుచుండి యుండిరి. కొంతవడికా శరీరము కదలెను. దానింగాంచి యొకఁడు. "అరే వీనిదెంత మొండిప్రాణము ? ముండవాడింత నదిలోఁబడి కొట్టుకొనివచ్చియు బ్రతికినాఁడే. "

అత్తరి నీ సమూహమునకుఁ గొంచెము దూరముననుండిన మఱియొకఁడు దగ్గరకువచ్చి "ఏమీ : ప్రాణమున్నదా?” యని యడుగ నున్నదని వచించిరి. అంత నా సిపాయి.

“ అట్లయిన మరల నెత్తుఁడు. నీటఁబారవైచివత్తము. " " చీ : దుర్మార్గుఁడా ! ప్రాణిని గాపాడిన నెట్టి మోక్షసుఖములు కల్గునో తెలియవా?" అని తక్కినవారు వచించిరి. అప్పుడు వారందఱకు నాయకుఁడుగానున్న వానికిని నా తురకకును ఈక్రింది సంభాషణ జరిగెను.

సిపాయి : ఇప్పుడెట్టి సౌఖ్యము కలిగినను, నీ వార్త సుల్తాను గారికిఁ దెలిసినపిదపఁ గలుగు సౌఖ్యము తరువాతనే !

నాయకు : ఈ సంగతి సుల్తానుగారి కేల తెలియవలయును ?

సిపా : దొంగతనము. రంకుతనము, దాగునాయేమి ?

నాయ : ఏడిచినావులే! సేనాపతిగూడ నామాట జవదాటఁడు. ఈ వార్త సుల్తానుగారి కెఱుకఁబఱప వలదంటే తెలుపనే తెలుపఁడు. ఇఁక నీవంటవారలుండినసరి,

సిపా : నాబోటి వారలమాట నటుండనిమ్ము. సుల్తానుగారి యాజ్ఞలఁ బాలింతువా ? లేదా ? కాఫర్ కంటబడినటులైన దత్క్షణము వానిఁ జంపి వేయమనికదా వారియుత్తరువు.

నాయ : నీ యధిక ప్రసంగముఁ జాలించి యావలకు పో!

13