ఈ పుట ఆమోదించబడ్డది

రాణి సంయుక్త


కన్యకా రత్నములలో నొకతెయైయున్నది. ఆమె గుణగణంబుల నేమని వక్కాణింతును. గురులయెడ నమ్రతయుఁ, దోడివారల యెడ విశ్వాసమును, బేదవారలయందు గరుణయు నందఱిపై సమదృష్టియుం గలిగి మూర్తీభవించిన సద్గుణపుంజయో యన నొప్పుచుండును. విద్యయందామెతోఁ దులఁదూగగల కాంత లిక్కాలమున లేరనియే వచింపనగును. ఇంతియేగాక శత్రు సమూహంబులు పురుషుఁడని భ్రమనొందునట్లు యుద్ధమున రణప్రావీణ్యము జూపఁగలదు. మఱియు చిత్రలేఖనమున గడునేర్పరి. చూపరులు ప్రకృతిసిద్ధములని భ్రమించుగతి పలురకములవస్త్వాళి నిర్మించుటలో ముందామెను జెప్పి తరువాత నింకొకరి జెప్పవలయు, ఆకన్నియ యిప్పుడు సుమారు పదునారుసంవత్సరములది. అట్టిసంపూర్ణ కళానిధియై రాజిల్లునా జవ్వని తనపంచప్రాణముల మీపై నిడుకొని రేయింబగళ్లు మీనామస్మరణయే చేసుకొనుచు నిద్రాహారములు సహితము మాని కృశించిపోపుచున్నది. జయచంద్రుడు స్వయంవరవిధి నామెకు వివాహముగావింప నెంచియున్నాడు. ఈ వార్తనే మీతోనపుడు చెప్పకదాచితి. వామమార్గలనుటతోడనే మీరు కత్తిగట్టి బయలువెడలుదు రనియు దమ్మూలమున నాకన్నియకు రక్షణగలుగు ననియు సావకాశముగ నీవార్త దెలియబఱచెదగాక యని యూహించి యిప్పటి కూరకుంటిని. ఎటులైనా కన్నియ మనోవాంఛితంబు నెరవేర్పుడు. మీకను జయచంద్రునకును గల వైరమునెంచి యుపేక్షషచేసినచో నిక్కముగనాకన్నియ యాశా

120