ఈ పుట ఆమోదించబడ్డది

పదునేడవ ప్రకరణము

మునాతీరమున గలిగిన యుద్ధజయమువలన బైరాగికిని చక్రవర్తికిని మైత్రి ప్రభలము కాసాగెను. పృధివీరాజతని బ్రాణన్నేహితునిగ నెంచుకొనుచు బ్రధానులతో సమానముగ గారవించుచు దనవద్దనే యుంచుకొనెను. ఇట్టుకొన్నిదినంబులు జరుగ నొకనాడాయోగి చక్రవర్తి నేకాంతస్థలమునకు గొనిపోయి యతనితో మహారాజా! నేను తమయెడలఁగావించిన యీచిన్న నేరమును క్షమింపుడు, దేవరవారితోడనే నన్నిసంగతులు వచించితినిగాని యొకటిమాత్రము చెప్పక దాచితిని. ఆనాడు కాళికాలయమున మీరు రక్షించినకన్య జయచంద్రునికూతు రని మాత్రము వచించియుంటిఁగాని యామెవిషయమై మఱేమియు జెప్పలేదు. ఆచిన్నదానిపేరు సంయుక్త యందురు. ప్రపంచము నందంతట సౌందర్యమున నగ్రగణ్యులని ప్రఖ్యాతిగాంచిన

119