ఈ పుట ఆమోదించబడ్డది

పదునారవ ప్రకరణము


సలుపరాదని యతనికెన్ని విధముల నుపకారములు గావించుచు వచ్చినను మహాప్రభో ! తుదకతనిమనోవాంఛ నన్ను జంపి నాకాంతం జెరబట్టవలెనని తలఁచునంతటి స్థితికి వచ్చినది. జనులనందఱు న్యాయమార్గానుగాములుగ నొనర్చి పాలింపఁదగిన రాజే యిట్టిక్రౌర్యములుచేయ నొడిగట్టిన నిఁక నానగరమున వసించుట ప్రాణాపాయకరమని యెంచి యొకనాటిరాత్రి నిల్లు వెడలి తమవంటిమహాత్ములదయ యున్నయెడల నెక్కడనైన నింత పొట్టబోసుకొనవచ్చునని యిట్లు వచ్చినాడను. ఇఁక దేవరవారి చిత్తానుసారము దాసుడనై మెలగ సిద్దముగానున్నా " నని వచింప జయచంద్రుఁ డతని దనదగ్గర నుంచుకొసుటకు శత్రువువద్దనుండి చనుదెంచినాడే యని సంకోచించుచున్న సమయమున నరనివలెనే డిల్లీనంతయుఁ బాడుచేసి కనూజిఁ జేరి యా రాజుగారి దయకుఁ బాత్రులై యున్న మఱియిద్ద రా వచ్చిన మనుజుని వృత్తాంతము సరియని చెప్పిరి. దాన సంశయ నివృత్తియగుడు జయచంద్రుఁ డతని గూడ నా యిరువురితో సమానముగ నుంచుకొంటకు సమ్మతించెను. పై ప్రకరణమున నీశ్వరభట్టు కన్పించలేదని కరీముతో సేవకులు వచించినట్లు జెప్పియుంటిగదా ! ఆ భట్టుగారే యీవచ్చిన కొత్త మనుజుఁడు. ఇతనికిని నా సాక్ష్యమొసంగిన నిరువురు మనుజులకును డిల్లీయందున్నపుడే పరిచయముండెను. వారు డిల్లీని వదలునపుడే భట్టుగారును విడచియుందురుగాని వారికివలె గాక రాజ్యము సంపాదించవలెనను వాంఛ యితని మనసున దృఢముగ నాటుకొనియుండెను. ఆ కారణము చేతనే డిల్లీ నింతవరకు

117