ఈ పుట ఆమోదించబడ్డది

రాణి సంయుక్త


పోనిమ్ము? నీకా మహానుభావుని యెడగల వైరము నావల నిడి యాతనియం దే దుర్గుణములు కలవో నిదర్శనపూర్వకముగఁ జూపింపుము. అప్పుడు నీ యిష్టానుసార మనశ్యము వర్తిల్లెద.” అని పలికిన " ఓసీ ! గ్రుడ్డువచ్చి పిల్లను వెక్కిరించినట్లు నీవు నాకు బుద్దుల గఱపుచుంటివా? నీ కాతని దుర్గుణములఁ గను బఱువలయునే? అట్లే చూపెదనుండు " మని పటపటపండ్లు కొఱుకుచు నచ్చోటువదలి రహస్యాలోచనా నిలయమున కేగి దగువారల రావించి వారితో జరగుచున్న సంగతులెల్లఁ జెప్పి యెటులైనఁ చక్రవర్తిపై దండెత్తి యతని గడదేర్చవలయునని పలికెను. అందుల కందఱు సమ్మతించి యేదైన నొక చిన్ననెపము పెట్టుకొని యుద్ధమునకుబోవుట మంచిదనిరి. కారణము దొరుకునా యని విచారించుచున్న సమయమున దౌవారికుఁ డరుదెంచి యెవడో డిల్లీనుండివచ్చి తమదర్శనార్థము ద్వారముకడ వేచియున్నాడన వాని వెంటగొనిరమ్మని రాజుగారు సెప్పిరి. వాఁడు నట్లేపోయి వచ్చిన మనుజుని వెంటగొనితెచ్చి వీరివద్ద విడచిపోయెను. ఆ వచ్చిన పురుషుఁ డక్కడున్న వారల కందఱకు నమస్కారములుచేసి యిట్లు వచింపసాగెను. “మహారాజా ! నేను ఢిల్లీ నగరమునం దొక ముఖ్యాధికారిని. నేనా చక్రవర్తియెడ విశ్వాసము గలిగి నా కార్యము లన్నియు న్యాయాను కూలముగ నెరవేర్చుకొనుచుండ నా శత్రువులగు తక్కిన కొందఱధికారుల వాక్యము లాలించి యతడు నాయెడ నిరాదరణయే సూపుచు వచ్చెను. అటులయ్యు స్వామిద్రోహము

116