ఈ పుట ఆమోదించబడ్డది

పదునారవ ప్రకరణము


జరుప నులికిపడిలేచి సంయుక్త తలిదండ్రులకు వందన మొనరింపబోవ మరల నొక తన్నుదన్ని " ఓసి ! దౌర్బాగ్యురాలా! నీ కేమి పోవుకాలము వచ్చినది? నా వంశము జెరుప దాపరించితివటే ? ఇన్నినాళ్లు పోషించినందులకు తుదకు నీ తల్లి దండ్రులతోడనే వైరమూన సాహసించితివా? ఓసి పాపిష్టిదానా! నీ చదుపు జట్టుబండ లేమన్ను గలసి పోయినవి ? ఇంతవరకును గుణవంతురాలవని తలచియుంటిగాని యింత గయ్యాళివని యెఱుగనైతి. నే వలదన్న వాని వరించి నా మీదనే కత్తిగట్ట సాహసించితివా? నా హృదయమునకు జిచ్చిడితివిగదే. నిన్నే మొనరించినను నా కసిదీర " దని యదివరకెంతో మృదు మధురముగ మాటలాడుస్వభావము కలవాఁడయ్యు, నదంతయుబోయి రోషమువలన నోట వచింపరాని యశ్లీల వాక్యంబుల బుత్రికం దూషించి తుదకు " ఓసీ ఇంత వరకైనది కానిమ్ము. క్షమించెద. ఇకనైన నాదౌర్భాగ్యుని వదలి నాయాజ్ఞానుసారము వర్తించెదవా? లేదా?" అన నాకన్నియ తలవంచుకొని తిన్నని యెలుంగున " తండ్రీ ! నీ కింతకోపమేటికీ? మనోవాక్కాయ కర్మలందు మనస్సుచే వరించినవానినే చేపట్టుట యుత్తమ పతివ్రతా లక్షణముగదా ! అందులకు వ్యతిరేకముగ నడుచుకొనుమని తండ్రివగు నీవే భోదించుచున్న నిఁక నేనేమనుదానను? అదియుంగాక నన్ను ఘోర కష్టముల నుండి గట్టెక్కించి ప్రాణముల నిలిపినవాడు చక్రవర్తి. అట్టి ప్రాణదాత యగు వానివలదని వేరొకని నెట్లు వరింపగలను?

115