ఈ పుట ఆమోదించబడ్డది

రాణీ సంయుక్త


తనభార్యం బిలచి కూతురు సమాచార మెటులున్నదో కనుగొని రమ్మవి పంపెను. ఆమెయు నటులేయనిపోయి కొంతసేపునకు మఱలివచ్చి, "ఆర్యా! అది మూర్ఖపుఁబట్టుఁ బట్టియున్నది. ఎంతచెప్పినను బృధివీరాజును దక్క నన్యువరింప ననుచున్నది. పోనిండు. దాని యిష్టప్రకార మేలఁ జేయరాదు? ఆ చక్రవర్తి యెడల మీకుమాత్ర మింతవైరమేల? అని యింకను నేమో చెప్పబోవుచుండ నడుమ నడ్డమునచ్చి ఓసీ ! నిన్నీ వెధవ శిపారసులు చేయమని యెవరు మొఱవెట్టిరి. పాపము కూతురి వెనుకవేసుకొని వచ్చుచుంటివా ! మీ రిద్దఱు గలసి యే గంగలోనైన దిగుడు. అంత నా ప్రాణము నెమ్మదిగ నుండును." అని తన ప్రియురాలిఁగూడ గసరి కొట్టి బిరబిర సంయుక్తయున్న స్థలమునకు బోవజొచ్చెను. ఆహా! అసూయా పరుండగువాఁ డెట్టి దుష్కృత్యము లొనరింప సమకట్టునో యోచి౦పుడు. పృధ్విరాజుపైగల యీర్ష్యయేగదా జయచంద్రు నింత దురాత్మునిగ జేసినది. అసూయ స్వార్ధపరత్వమునకు జన్మకారణమని చెప్పవచ్చును. కన్న బిడ్డలయందును, ప్రియురాండ్ర యెడలను గల మోహమునుగూడ బారదోలుగదా ! ఈ పాడుగుణము, ఈ దౌర్భాగ్యపుగుణ మున్నంతవరకు మనదేశము మంచి స్థితికి రాదనుట నిర్ధారణము. జయచంద్రు డట్లు పోపుచుండ రాణియు హా ! కూతురాయని యాక్రందనము

సేయుచు నతని వెంటనే యరిగెను. మందిరములోకేగి పరద్యానముతో నొకసోఫాపై గూరుచున్న కూతురి నొక్క చరుపు

114