ఈ పుట ఆమోదించబడ్డది

రాణీ సంయుక్త


సేపకుఁ డరుదెంచి రాజభటులు దేవిడీచుట్టు గ్రమ్మి తన్ను వెదకుచున్నారని వచింప నుల్కిపడి లేచి చెంతనున్న బాకు నొకదానిఁ గైకొని సొరంగమార్గమున బారిపోవుటకు దొడ్డి గుమ్మము దగ్గఱకుఁ బోఁబోవవ నప్పటికే యచట భటులు నిలచి యుండిరి. మఱియొక ద్వారముకడకేగి చూడ నక్కడ నట్లే మూగియుండిరి. వేరొండు కవాటమువద్దకేగ నక్కడ నంతకన్న మిక్కుటముగ నుండిరి. ఇట్లు మందిరము నాల్గువైపుల రాజభటు లావరించి యుండుట దెలుసుకొని యొడలెల్ల జెమ్మటలు క్రమ్మగ జగజగవణకుచు నిశ్చేష్టితుడై నోటమాటలేక నేలకొరగెను . తోడనే యక్కడకు వచ్చిన భటు లా పిఱికిపందను విరిచికట్టి తమ యేలికయొక్క యాజ్ఞానుసారము గావింపఁ గొంపోయిరి.

112