ఈ పుట ఆమోదించబడ్డది

రాణీ సంయుక్త


బయటఁ బారవేయుచున్న తరి నొకని చేతికి వెంట్రుకలు దగులఁ జప్పున నుల్కిపడి మరల ధైర్యముఁ దెచ్చుకొని పరికింప మనుష్యుని తల స్పష్టముగఁ గన్పించెను. వాఁడును దానిఁబట్టుకొని యీడ్చుకొనివచ్చి తీరమునవైచి యాసంగతిఁ దక్కిన వారల కెఱుకఁబఱుప నందఱు పరువెత్తుకునివచ్చి యా శరీరము చుట్టుజేరి వీక్షింపసాగిరి. అత్తరి నీ క్రిందిసంభాషణ ప్రారంభమయ్యెను.

ఒక మహమ్మదీయుఁడు : అరె! ఎవఁడురా వీఁడు ? కాఫరువలె నున్నాడు.

ఇంకొకఁడు : ఎవఁడైననేమి ? బ్రతికియున్నాఁడా?

మఱియొకఁడు : ఏమో !

వేరొకఁడు : నీ కెక్కడ దొరకినాఁడు?

శరీరమును దెచ్చినవాఁడు : అల్లదే! యా వైపునఁ గొట్టుకొని పోవుచుండ మొదటచూచి కుండబొచ్చెయని పట్టుకొనఁబోవ వెంట్రుకలు చేతికిఁ దగిలినవి. తరువాత దిన్నగఁ , బరిశీలింప మనిషి.

ఆ సమయమున వేరొకఁడు శరీరమును సమీపించి పొట్ట పైఁ గాలుపెట్టి ద్రొక్క లోపలనున్న నీళ్లన్నియు రంధ్రములద్వారా జిమ్మన గొట్టములనుండి వచ్చినట్లు బయటికేతెంచెను. అతఁ గొందఱాకాయమును జలిగాచుకొనుచున్న నెగడి వద్దకుఁ గొంపోయి ప్రక్కనఁ బరుండఁబెట్టి తమ శరీరముల దుడిచికొని క్రొత్త దుస్తులఁ దాల్చి యందఱును దీనిఁజూచుచుఁ

12