ఈ పుట ఆమోదించబడ్డది

రాణి సంయుక్త

"ఇంటిదొంగ నీశ్వరుఁడైన బట్టఁజాల" డనునట్లు తస కొలువునందే యుండి యెదుట ముఖస్తుతులు సేయుచు లోలోపలఁ గుట్రలఁ బన్నుచున్న వీరిద్దరినడవడి నెంతమాత్రము గుర్తింపజాలక చక్రవర్తి రాజ్య మేలుచుండెను. ఇటులుండ వేదవేదాంగ షట్చాస్త్రపారంగతుడగు బైరాగి యొకఁడరుదెంచి చక్రవర్తికి దన విద్యానైపుణ్యముం గనుబఱచి మన్ననలంది యతనినానతి కొన్నిదినము లక్కడనేయుండి నృపునకు వేదానుకూలమగు రాజనీతు లుపదేశించుచు మైత్రిని సంపాదించి యేకాంతముగ గొన్ని నూతన వృత్తాంతము లెఱుకపఱచి నిదర్శనములఁ జూపింప జక్రవర్తియు నాశ్చర్యమగ్నుడై వెంటనే బైరాగి మార్గదర్శిగా గొంత నైన్యమునంపి రాజ్యము బ్రధానుల కొప్పగించి జాగ్రత్త గలిగియుండుడని నియమించి తానును మఱింత సైన్యమును గొందఱు దాసీలను వెంటఁగొని వెడలి పోయెను. దుష్టద్వయము రాజునగరమున లేనితరిఁ గొన్ని యల్లరులు చేయగడఁగిరి. కాని ధీవిశారదులగు మంత్రి ప్రముఖులచే నవన్నియు నడఁచి వేయబడెను. కుతుబుద్దీను నడంచిన దీ బైరాగి మార్గదర్శిగఁ బోయిన సేనయే తరువాత వారికి సహాయపడవచ్చిన రాజపురుషుండు చక్రవర్తియని చెప్ప నక్కరలేదు. అప్పుడట్లు కుతుబుద్దీను నోడించి సంపూర్ణజయముతో మూడువేల మహమ్మదీయ ఖైదీల వెంటగొని చక్రవర్తి రాజధానిఁ జేరవచ్చిన వార్త కరీమునకు దెలిసిన వెంటనే యతనికి గలిగిన యారాట మింతింత యని చెప్పనలవికాదు.

110