ఈ పుట ఆమోదించబడ్డది

పదునేనవ ప్రకరణము


లేశమైన లేదు. తెల్లవారినదిమొద లొండొరుల దూషించుకొనుచు నొకరిపైనొకరు నిందలు మోపుకొనుచుఁ బోరాడు చుండుటయేగాని దేశోపకారముకొఱకు బాటుపడుద మనువారలు మిక్కిలియరుదు. ఇట్టివారలకుఁదుదకు దుఃఖరూపక నరకమే గాక వేరొండుకలుగునా ? స్వార్ధపరత్వమూని దురాశా బద్దులై యెడతెగని మనోచింతచే గృశింపుచు, నుపకార మనుమాటలేక లోభులై, ధర్మహీనులై తుదకు ముక్తికిని దూరులగు చున్నారు. సోదరులారా ! ఇట్టి యిహపరలోకములకుఁ గొఱగాని స్వార్ధపరత్వము నేలత్యజింపరు? మీకుమీకేగాక స్వదేశమును సంఘమును నట్టి భాగ్యవంతముగ జేయ బ్రయత్నింపుఁడు. స్వార్ధపరత్వమును మీహృదయములనుండి పారదోలుడు. ఐకమత్యము వహించి మీదేశక్షేమమునకై పాటుపడుడు. ఇఁక గధాంశమునకు వచ్చెదము. రాజ్యముందు వీరిరువురుదప్ప దక్కిన ప్రధానులు మంత్రులు నక్షౌహిణిపతులు మొదలగువారు తమ ప్రాణముల సహితము జక్రవర్తి కర్పించునంతటి భక్తితో నుండిరి. కాన నతని కేవిధమైనచిక్కులు గలుగకుండెను. పైన వచించిన దుష్టద్వయమునకుఁ జెరియొక దేవిడీకలదు. అందు మహమ్మదీయుడు తనకొఱకై యేతెంచు మ్లేచ్ఛభటులు నగరమందలి తక్కిన యధికారుల కంటఁబడినచో హానియగునని యూరిబైట నాలుగైదు మైళ్ళదూరమునుండి తన దేవిడీలోని కొక సౌరంగము ద్రవ్వించి దానిగుండ దనవారలు రాకపోకలు చేయ నేర్పరచుకొని చేతనైనన్ని కుట్రలఁ బన్ను చుండెను.

109