ఈ పుట ఆమోదించబడ్డది

రాణీ సంయుక్త


కోరికలు నెరవేరినతోడనే డిల్లీయం దర్ధరాజ్య మిప్పింతుననియు వాగ్దానము సేసెను. నాటినుండి వారిరువురి పోకలకు మేరయే లేదు. చక్రవర్తినాశనమై తనకర్దరాజ్యము రానున్నదని భట్టుగా రువ్విళులూరుచు మహమ్మదీయునకుఁ జేదోడు వాదోడుగ మెలగుచుండెను. చదువరులారా! ఈ భట్టుగారివంటి స్వార్ధపరుల మూలముననే గదా యనేక స్వతంత్ర రాజ్యములు మన్నుఁ గలసిపోయినవి. స్వార్ధపరత్వమను గుణ మెంత చెడ్డదియో బాగుగ నాలోచింపుడు. ఈ యవగుణ రాజమును బూనియున్నవాడు. దనకు దాన లక్షలకొలంది. ద్రవ్యమును సంపాదించి బాగుపడవలెనను పట్టుదలగలిగి పరుల కనేకగతుల నపకారమొనర్చుచుఁ దుదకు తాను నష్టపడి దేశమునంతయు నాశనము కావింపఁ బాల్పడుచున్నాడు. ఒకవేళ నట్టికుబుద్ధులకు దాత్కాలికముగఁ గొన్ని సౌఖ్యములు గలిగినను రాఁబోవు నిజ సంతతులకుఁ జెప్పరాని నష్టము గలుగఁజేయుటయే గాని లాభము గలుగఁజేయు టెన్నటికిఁ గాదు. ఎనిమిదివందలయేండ్ల క్రిందటి యీ భట్టుగారివంటి దుర్మార్గుల మూలముననే కదా స్వరాజ్య మన్యరాజ్యమైనది. ఈ భట్టుగారు మొదలగువారి కా దినములలో సౌఖ్యమే కలిగినదని యనుకొందము. కాని దానిఫలిత మాలోచింపుడు. తరువాత వారి సంతతివా రందరు మ్లేచ్ఛులచేత నెన్ని కష్టములందిరో యెవరికెఱుక? ఇప్పటికిని మనదేశమం దీ గుణము పూర్తిగనే పాతుకొని యున్నది. ఎవనికొఱకు వాడు చూచుకొనుటయే గాని పరోపకారమన్న

108