ఈ పుట ఆమోదించబడ్డది

పదునేనవ ప్రకరణము


నోడించెను. అనంతర మానందపాలుఁడును దన తండ్రిచేసిన ప్రకారము తనకుమారునకు బట్టముగట్టి పోయెను. తరువాత క్రీస్తు శకము పదివందల నిరువదియొకటవ సంవత్సరమున మఱల గజినీ దండెత్తివచ్చి యానందపాలు పుత్రునోడించి రాజ్యముదనస్వాధీనము చేసుకొనెను. నాటినుండియు లాహోరున మహమ్మదీయరాజ్యము స్థాపింపబడెను. గజినీ మరణానంతరము కూడ నారాజ్యము మహ్మదీయవశమందే యుండెను. పండ్రెండవ శతాబ్దమున సుల్తాన్ మహ్మద్‌గోరీ యనునతఁడు దానిదన వశము గావించుకొని పరిపాలించుచు నార్యావర్తము నంతయు జయింపదలఁ పూనియుండెను. అట్టి తలంపున నీ దేశమందలి వారల కెఱుకలేకుండ గొన్ని చిన్నచిన్న సేనల నక్కడక్కడ నుంచి రాజుల సమాచారము దెలియఁజేయుటకై నిపుణులగు వారి ననేకస్థలముల కంపెను. పైకరీమును నిట్లు పంపబడిన వారిలో నొకడు, ఇతఁ డతికుయుక్తుఁడు. తన పై యధికారుల యెడల నెట్లు వినయముతో నడచుకొన వలసినదియు, వారి కనుల నెట్లు దుమ్ముకొట్టవలసినదియు నితనికి బాగుగఁ దెలియును. చక్రవర్తి మతవివేచన బాటింప కెల్లర గౌరవించునని తెలుసుకొని పురమునందె యొక యధికారిగనున్న నెక్కువ రహస్యములు కనుగొనుటకు వీలగునని యూహించి చక్రవర్తి నాశ్రయించి కొద్దికాలమునకే యొక ముఖ్యాధికారిపదవి నందెను. ఇతడు భట్టుగారు జేయుచున్న కుతంత్రముల దెలుసుకొని యతనికడకేగి తనకు సాహాయ్యపడవలయు ననియుఁ దన

107