ఈ పుట ఆమోదించబడ్డది

పదునేనవ ప్రకరణము

న్యాకుబ్జనగరమందలి వృత్తాంతము లటులుంచి యించుక డిల్లీని గూర్చి విచారింతము. చౌహానవంశస్థుఁడగు పృధ్వీరాజాపురమును బాలించుచుండెనని యిదివరకే తెలిపియుంటిమిగదా! ఇత డార్యమతావలంబకుఁడును, న్యాయపరిపాలకుడును, బుద్దిశాలియు, నతిభోగశాలియునై రాజ్యమేలుచుండెను. ఇతఁడార్యమతమువాఁ డగుటచే సమస్తకులములవారిని వారివారి యోగ్యతానుసారము మన్నించుచువచ్చెను. అందులకు నిదర్శనముగ మనకధా సందర్భమున వచ్చువా రినిరువుర వక్కాణించెదను. ఈశ్వరభట్టను నతఁడు జైనమతస్థుడు. ఇతడు త్రివిష్టపము నుండి చనుదెంచి రాజు నాశ్రయించి మొదట నొకచిన్న యధికారిగనుండి క్రమముగ యుక్తిచాతుర్యములవలన నొకముఖ్యాధికారి యయ్యెను. గొప్పయధికారము చేకూరి నదిమొదలు

105