ఈ పుట ఆమోదించబడ్డది

పదునాల్గవ ప్రకరణము


మందయానంబున నరుదెంచి సభలో నాసీనయయ్యెను. ఉబ్బెత్తు యద్దపుబిళ్ళను సూర్యుని యెదుట బెట్టినతోడనే నలుదిక్కులఁ బ్రసరించియుండు కిరణములన్నియు దాని తేజఃకేంద్రమునకే చేరులీల స్వయంవరోత్సవముఁ జూడవచ్చిన సమస్త జనుల చూపులు సంయుక్త ముఖముమీదనే వ్రాలెను. ఎనిమిది గంటలగుడు పురోహితుఁడు పుష్పహార మొక దానిని సంయుక్తచేతి కొసఁగి నీ యిష్టమువచ్చిన రాజవరుని కంఠమున వ్రేయుమని చెప్పి రాజుల వేరుపఱచి చెప్పుట కెవరు తగుదురని యాలోచించుచున్నతరి మంజరి నేనని ముందునిలచెను. అందుపై నామెనే నియోగించిరి. అత్తరి సంయుక్త తన సహజారుణములగు హస్తముల హారముధరించి లజ్జానతాననయై రాజలోకంబు నెదుటకు వచ్చుచుండఁ బ్రతివాఁడును ధననే వరించునని గుటకలు మ్రింగుచుండెను. మంజరి యొక్కొక్కని జూపించి తెలియజెప్పు చుండెను. ముఖ సంజ్ఞలచే వ్యతిరేక భావమును సూచించు సంయుక్త ముందుచూపులు చూచుచుండెను. ప్రతి రాజకుమారుడును దన పైవానివదలి తనదగ్గర కేతెంచుతరి నిక దన్నే వరించునను సంతోషమున మొగము కలకలలాడ గూరుచుండి వ్యర్ధమగుటతోడనే విన్నదనంబు నొందుచుండెను. అటనున్నవారి నందఱఁ దెలియఁజెప్పెను గాని సంయుక్త యెవ్వని వరింపదయ్యెను. సభయందలి పారెల్లరు విభ్రాంతి వహించి కూరుచుండి యుండిరి. అంత మంజరి పృధివీ రాజును వర్ణించి బహిర్ద్వారమున శిలావిగ్రహుఁడై యున్నాడన

103