ఈ పుట ఆమోదించబడ్డది

పదునాల్గవ ప్రకరణము


జరుగుచున్నసంగతు లన్నియు వచింప నిశ్చేష్టితమై కొంతసేపటి వరకు మాటలేక నిలువబడి తుదకు " కట్టా ! నా జనకుండిట్టి కట్టడి యయ్యేగా ! నేనిఁక నెవరితో మొరనిడుకొందు? ఎవరు నావేదనఁ దీర్చువారలు? ఎవరు నా ప్రాణకాంతుని నన్నుఁ గూర్చువారలు? నన్ను ఘోరమగు విపత్తునుండి తప్పించి రక్షించిన యా జగన్మోహనాకారునకుందక్క పరుల కీశరీరము యెటు లర్పింపగలుగుదు. హా! జనకా! నా యిష్టములేవి యెవనికో యొకనికి నన్నంటగట్టి యందులకే ననారతము విలపించుచుండ నీవుచూచి భరింపగలవా? ఇట్టి యుద్దేశము నీవుకలిగియున్నప్పు డీ స్వయంవర సంరంభమంతయు నేటికి ? స్వయంవరమనఁ గన్నియ దన కిష్టమగు వరువి జేపట్టవలయుఁ గదా! ఆర్యావర్తమునంగల రాజులనెల్ల రప్పింప కిట్లేల పక్షపాతము గావించితి " వని పలుగతులఁ జింతించి తండ్రిని దూరుచు నేట్టకేల కొక సాహసకృత్యమును గావింప నిశ్చయించుకొని మంజరికి కొన్ని రహస్యములు బోధించి తానా నాఁడు రాత్రిఁ దిన్నగ నాహారమునైనఁ గుడువక చాలా ప్రొద్దు పోయినపిదప నెట్లో శయనించెను. అంత బాలభానుండు దన బాలారుణదీప్తులచే నలంకృతములగు రాజవీధులకు నూత్న శోభగల్పించుచు నుదయపర్వతముపైఁ దోచెను. ఆ నాడు పని పాటలవా రందరు దమతమ వ్యాపారములకుఁ బోవుటమాని గృహములందే వసించియుండిరి. నగరమునం దెల్లెడల ప్రభాత కాలవాద్యములు మ్రోఁగుచుండెను. సంయుక్తయు మేల్కాంచి

101